Kadapa: ఏపీ సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కుచ్చుటోపీ! 50 లక్షల డబ్బు గుటకాయస్వాహా

|

Jun 16, 2022 | 12:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి..

Kadapa: ఏపీ సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కుచ్చుటోపీ! 50 లక్షల డబ్బు గుటకాయస్వాహా
Job Cheating
Follow us on

Kadapa police arrested a man for allegedly cheating jos aspirants: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు దండుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి సచివాలయం (AP secretariat)లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి వద్ద లక్షల డబ్బు దండుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్‌స్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో వ్యక్తి దగ్గర ఏకంగా నలభై లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఈ విధంగా ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద సుమారు యాభై లక్షల రూపాయల వరకు నిందితుడు వసూలు చేశాడు.

తమకు ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తావంటూ బాధితులు నిలదీయడంతో రామాంజనేయులు ముఖం చాటేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బద్వేల్‌ రూరల్ పోలీసులకు (Badwell Rural Police) ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన బద్వేలు రూరల్ పోలీసులు రామాంజనేయులును గురువారం (జూన్ 16) అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అతని వద్ద నుంచి 5 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, ముద్దాయిలకు సంబంధించి రెండు బ్యాంక్ పుస్తకాలు, ఒక బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.