Guntur: అక్కడ ధూమపానం నిషేధం.. న్యాయమూర్తి ఆదేశాలతో వెలసిన బోర్డులు..!
సాధారణంగా న్యాయవాదులు టీ సేవిస్తూ తమకిష్టమైన సిగెరెట్ కాలుస్తూ ఉంటారు. అయితే జల్లా న్యాయమూర్తి పార్ధసారధి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలావతి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. . ఇక నుండి కోర్టు ఆవరణలో సిగరెట్లు అమ్మితే దుకాణాలు తొలగిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఏకంగా ధూమపానాన్ని నిషేధిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయించారు.
సెక్షన్లను తిరగేస్తూ చట్టాలతో కుస్తీ పట్టే న్యాయవాదుల్లో కొంత మంది ధూమపాన ప్రియులు ఉంటారు. కక్షిదారులతో మాట్లాడుతూ ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకుంటూ మధ్య మద్యలో ఒకటో రెండో సిగరెట్లు తాగడం లాయర్లకు అలవాటే..! అయితే ఇప్పుడు జడ్జి ఆదేశాలతో ఆ అలవాటుకు చెక్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విశాలమైన ప్రాంగంణంలో ధూమపానాన్ని నిషేధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చేశారు. ఇంకేంముంది న్యాయవాదులు పాటించాల్సిదేనంటున్నారు స్థానికులు..!
గుంటూరు జిల్లా న్యాయస్థానం విశాల ప్రాంగంణంలో ఉంటుంది. ప్రతి రోజు వందల సంఖ్యలో న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయమూర్తులు ఈ ప్రాంగణంలో సంచరిస్తుంటారు. కోర్టులతో పాటు బార్ అసోసియేన్ కార్యాలయం, టీ, టిఫిన్ స్టాల్, పుస్తక విక్రయ కేంద్రం, జిరాక్స్ షాపు వంటి అనేకం ఈ ప్రాంగంణంలోనే ఉంటాయి. దీంతో సాధారణంగా న్యాయవాదులు టీ సేవిస్తూ తమకిష్టమైన సిగెరెట్ కాలుస్తూ ఉంటారు. అయితే జల్లా న్యాయమూర్తి పార్ధసారధి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలావతి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. దుకాణం దారులతో మాట్లాడారు.
ఈ క్రమంలోనే ఇక నుండి కోర్టు ప్రాంగణంలో ధూమపానాన్ని నిషేధిస్తున్నట్లు జడ్డి పార్ధసారధి ప్రకటించారు. ఇక నుండి కోర్టు ఆవరణలో సిగరెట్లు అమ్మితే దుకాణాలు తొలగిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. అంతే కాదు కోర్టు ఆవరణలో పొగ త్రాగితే రెండు వందల రూపాయల జరిమానా విధిస్తామన్నారు. ప్రాంగణం మొత్తాన్ని పరిశీలించిన న్యాయమూర్తి ఏకంగా ధూమపానాన్ని నిషేధిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయించారు.
తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పొగత్రాగడాన్ని నిషేధిస్తున్నట్లు బోర్డులు పెట్టించారు. దీంతో న్యాయవాదులు పెద్ద చిక్కే వచ్చిపడిందని అనుకుంటున్నారు. జడ్డి గారి ఆదేశాలను పాటించాలంటూనే ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కోర్టు వెలుపల ఉన్న టీ స్టాల్స్ కి క్యూ కట్టేందుకు లాయర్లు సిద్దమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..