Andhra Pradesh: అగ్రి వర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, కేజీబీవీల్లో ప్రవేశాలు.. పూర్తి వివరాలు మీకోసం..

|

Jul 03, 2021 | 7:46 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ, వర్సిటీలో ప్రవేశాలు, కేజీబీవీల్లో ప్రవేశాలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్జీ రంగా వ్యవసాయ..

Andhra Pradesh: అగ్రి వర్సిటీలో ఆన్‌లైన్ కోర్సులు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, కేజీబీవీల్లో ప్రవేశాలు.. పూర్తి వివరాలు మీకోసం..
Notifications
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ, వర్సిటీలో ప్రవేశాలు, కేజీబీవీల్లో ప్రవేశాలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యూనివర్సిటీ నిర్వహించే ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ మేరకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కేఎస్ పూర్ణిమ పేరిట ప్రకటన విడుదల చేశారు. ఈ ఆన్‌లైన్ కోర్సుల్లో భాగంగా సేంద్రీయ వ్యవసాయం, మిద్దె తోటలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నారు.

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అనుమతి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆయా ఉద్యోగాల అర్హతలకు సంబంధించి మార్కులు ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు లేకుండా నియామకాలు చేపట్టాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

కేజీబీవీల్లో ప్రవేశాలు..
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడగించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం.. రాష్ట్రంలోని 352 కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు. https://apkgbv.a pcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Also read:

Horoscope 3 July 2021:ఆర్ధికంగా లాభం చేకూరాలంటే.. ఈ రోజు ఏయే రాశులవారు ఏ దేవతలు పూజించాలంటే

Bandla Ganesh: అంతరిక్షంలోకి వెళుతోన్న తొలి తెలుగు మహిళ.. బండ్ల గణేశ్‌కు బంధువా.? వైరల్‌గా మారిన ట్వీట్‌..

Snake Bite: ప్రాణం పోయిందని పట్టుకున్నాడు.. ఊహించని రీతిలో అతని ప్రాణాన్నే తీసిన పాము..