Srisailam: శ్రీశైలం వజ్రోత్సవ వేడుకల పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

| Edited By: Surya Kala

Oct 28, 2023 | 5:07 PM

శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టు వైద్యశాల ప్రాజెక్టు హైస్కూల్ నిర్మించి ఆరవై ఏండ్లు పూర్తి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వీవీ లక్ష్మీనారాయణ. శ్రీశైలం ప్రాజెక్టు హైస్కూల్ నందు విద్యనభ్యసించి ఒక పోలీసు ఐపిఎస్ గా ఉన్నతమైన స్దాయికి ఎదిగిన మాజి జేడి లక్ష్మినారాయణను ఆయన చదువుకున్న స్కూలుకు ఎంతో మంచి పేరు తెచ్చారని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి చెప్పారు.

Srisailam: శ్రీశైలం వజ్రోత్సవ వేడుకల పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
V. V. Lakshmi Narayana
Follow us on

శ్రీశైలం ప్రాజెక్టు హైస్కూల్ నిర్మించి 60 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాజెక్టు హైస్కూల్ లో చదువుకుని వివిధ హోదాలలో ఉన్నతస్దాయికి ఎదిగిన ఓల్డ్ స్టూడెంట్ మాజీ జేడి లక్ష్మినారాయణ ఆద్వర్యంలో 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.  ముందుగా మాజీ జేడి లక్ష్మినారాయణ జ్వోతి ప్రజ్వలన చేసి ఓల్ట్ స్టూడెంట్స్ తో జ్వోతిని వెలిగించారు. అనంతరం పెద్దలను గురువులను గుర్తు చేసుకుంటూ పది నిముషాల పాటు మౌనం పాటించారు. 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలకు తరలి వచ్చిన వేలాదిమంది పాత విద్యార్థులను ఒకరినొకరు పలకరించుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. వజ్రోత్సవ వేడుకలకు శ్రీశైలం దేవస్థానం ఈ ఓ పెద్దిరాజు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టు వైద్యశాల ప్రాజెక్టు హైస్కూల్ నిర్మించి ఆరవై ఏండ్లు పూర్తి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వీవీ లక్ష్మీనారాయణ. శ్రీశైలం ప్రాజెక్టు హైస్కూల్ నందు విద్యనభ్యసించి ఒక పోలీసు ఐపిఎస్ గా ఉన్నతమైన స్దాయికి ఎదిగిన మాజి జేడి లక్ష్మినారాయణను ఆయన చదువుకున్న స్కూలుకు ఎంతో మంచి పేరు తెచ్చారని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి చెప్పారు. అంతే కాకుండా ప్రాజెక్టు హైస్కూల్ నందు చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నత స్దాయికి ఎదిగారని ఈ వజ్రోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీశైలం ఈఓ పెద్దిరాజు , ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి అన్నారు. ముందుగా వజ్రోత్సవ వేడుకల లోగోను శ్రీశైలం ప్రాజెక్టు హైస్కూల్ ఓల్డ్ స్టూడెంట్ మాజి జేడి లక్ష్మినారాయణ ఆవిష్కరించారు.  హైస్కూల్ నందు చదువు చెప్పిన పాత గురువులను శాలువాలతో సత్కరించి తమకు స్కూల్ తో ఉన్న అనుబంధాన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..