Tadipatri: తాడిపత్రిలో హై టెన్షన్.. పొలిటికల్‌ ఫైట్‌ కాస్తా పోలీస్‌ టర్న్‌.. డీఎస్పీపై జేసీ ప్రభాకర్ ఫైర్

పెద్దారెడ్డి వర్సెస్‌ ప్రభాకర్‌రెడ్డి. కాదు కాదు ప్రభాకర్‌ రెడ్డి వర్సెస్‌ చైతన్య. తాడిపత్రి ఫైట్‌లో లేటెస్ట్‌ సీన్‌ ఇది. ఇంతకీ, తాడిపత్రిలో ఏం జరుగుతోంది? జేసీ ప్రభాకర్‌రెడ్డి టార్గెట్‌ ఎందుకు మారింది? తాడిపత్రి పొలిటికల్‌ ఫైట్‌ కాస్తా..

Tadipatri: తాడిపత్రిలో హై టెన్షన్.. పొలిటికల్‌ ఫైట్‌ కాస్తా పోలీస్‌ టర్న్‌.. డీఎస్పీపై జేసీ ప్రభాకర్ ఫైర్
Jc Prabhakar Reddy
Follow us

|

Updated on: Oct 01, 2022 | 8:52 AM

పెద్దారెడ్డి వర్సెస్‌ ప్రభాకర్‌రెడ్డి. కాదు కాదు ప్రభాకర్‌ రెడ్డి వర్సెస్‌ చైతన్య. తాడిపత్రి ఫైట్‌లో లేటెస్ట్‌ సీన్‌ ఇది. ఇంతకీ, తాడిపత్రిలో ఏం జరుగుతోంది? జేసీ ప్రభాకర్‌రెడ్డి టార్గెట్‌ ఎందుకు మారింది? తాడిపత్రి పొలిటికల్‌ ఫైట్‌ కాస్తా పోలీస్‌ టర్న్‌ తిరిగింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య సాగుతోన్న హై ఓల్టేజ్‌ వార్‌లోకి ఓ డీఎస్పీ వచ్చి చేరారు. టీడీపీ కౌన్సిలర్లపై వరుస దాడుల తర్వాత తాడిపత్రి డీఎస్పీ చైతన్య టార్గెట్‌ను టార్గెట్‌ చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. డీఎస్పీ చైతన్య టార్గెట్‌గా అవినీతి చిట్టా విప్పారు ప్రభాకర్‌రెడ్డి. తాడిపత్రి డివిజన్‌లోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి డీఎస్పీ చైతన్య అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. గ్రానైట్‌ వ్యాపారుల నుంచి వసూళ్లు చేయలేదా? ఓ మహిళ నుంచి లక్షలు రూపాయలు తీసుకోలేదా? నీ కొడుకు బర్త్‌డే కోసం కిందిస్థాయి పోలీసుల నుంచి గిఫ్ట్‌లు తీసుకోలేదా? అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపణలపై ఘాటుగా రియాక్టయ్యారు తాడిపత్రి డీఎస్పీ చైతన్య. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఉన్నతాధికారుల అనుమతితో కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. లాయర్‌ ద్వారా నోటీసులు పంపిస్తానన్న డీఎస్పీ చైతన్య, పూర్తి వివరాలు ఇవాళ వెల్లడిస్తానంటూ ప్రకటించారు.

కాగా.. వరస పొలిటికల్‌ ఎటాక్స్‌తో తాడిపత్రి అట్టుడికిపోతోంది. టీడీపీ కౌన్సిలర్లపై జరుగుతున్న దాడులతో తాడిపత్రిలో హై టెన్షన్‌ వాతావరణం కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్‌గా, నందలపాడు కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌పై జరిగిన ఎటాక్‌తో భయాందోళనలు నెలకొన్నాయి. టీడీపీ కౌన్సిలర్లపై దాడులు నిరసిస్తూ తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నాకు దిగడంతో కొన్ని గంటలపాటు హైటెన్షన్‌ సిట్యువేషన్‌ కొనసాగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎంత మందిపై దాడులు చేస్తారో చేయండి… మేమూ చూస్తామంటూ ప్రత్యర్ధులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా గొడవ మొదలైందని పోలీసులు చెబుతున్నారు. దీంతో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాడిపత్రి – అనంతపురం ప్రధాన రహదారిలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన ప్రాంతంలోని విగ్రహానికి ముసుగు వేసి నిలబెట్టారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాడు. ఆ పరిస్థితులే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..