Pawan Kalyan: వారాహి ఐదో విడత యాత్రపై పవన్ చర్చలు.. రైతుల సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైన జనసేన చీఫ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చారు..హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు..కొంతకాలంగా పవన్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడ్డారు...తిరిగి కోలుకోవడంతో ఆయన మళ్లీ మంగళగిరి వచ్చారు..నాలుగో విడత వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన సమయంలోనే పవన్ కొంచెం ఇబ్బంది పడ్డారు..మచిలీపట్నంలో పార్టీ నేతలతో సమావేశంలో ఆయన తీవ్ర నడుంనొప్పితో మధ్యలోనే వెళ్లిపోయి రెస్ట్ తీసుకున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చారు..హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు..కొంతకాలంగా పవన్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడ్డారు…తిరిగి కోలుకోవడంతో ఆయన మళ్లీ మంగళగిరి వచ్చారు..నాలుగో విడత వారాహి యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన సమయంలోనే పవన్ కొంచెం ఇబ్బంది పడ్డారు..మచిలీపట్నంలో పార్టీ నేతలతో సమావేశంలో ఆయన తీవ్ర నడుంనొప్పితో మధ్యలోనే వెళ్లిపోయి రెస్ట్ తీసుకున్నారు…ఆ తర్వాత వైరల్ ఫీవర్ తో హైదరాబాద్ వెళ్లి అక్కడే ట్రీట్ మెంట్ తీసుకున్నారు..హైదరాబాద్ నుంచి మంగళగిరి వచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు.. తాజా రాజకీయ పరిస్థితులు,వారాహి విజయయాత్ర ఐదో విడత,జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు సూచనలు చేసారు పవన్ కళ్యాణ్.
వారాహి ఐదో విడత యాత్ర నిర్వహణపై సుదీర్ఘ చర్చ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ఇప్పటివరకూ నాలుగు విడతలు పూర్తయింది.మొదటి విడత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగించారు..ఇక రెండో విడత విజయయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించి తణుకు బహిరంగ సభతో ముగించారు..మూడో విడతలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగింది..నాలుగో విడత వారాహి విజయయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగింది..అవనిగడ్డ,మచిలీపట్నం,పెడన,కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించారు..మచిలీపట్నం మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పవన్ వారాహి బహిరంగ సభల్లో పాల్గొన్నారు…ఎక్కడ బహిరంగ సభ జరిగినా స్థానిక అధికార పార్టీ నేతలతో పాటు సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్…ఇక ఈసారి ఐదో విడత వారాహి విజయయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నాదెండ్ల మనోహర్ తో చర్చించారు పవన్ కళ్యాణ్…ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా పవన్ పై విమర్శల దాడి పెంచారు..దీంతో ఈసారి వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్….సీఎం జగన్ టార్గెట్ గా ముందుకెళ్తారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు..అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లాలో ఈసారి వారాహి యాత్ర ఉండే చాన్స్ ఉందని పార్టీ వర్గాల సమాచారం.
రైతుల సమస్యలపైనే దృష్టి..
రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులుపైనా నాదెండ్లతో పవన్ చర్చించారు..సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయినట్లు చర్చలో ప్రస్తావనకు వచ్చింది..రైతుల పక్షాన నిలవాలని,అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగాపెడుతున్న కేసులపైనా పవన్ – నాదెండ్ల చర్చించారు..తెలుగుదేశం పార్టీతో సమన్వయం కోసం ఉమ్మడి సమావేశం నిర్వహణ,ఏయే అంశాలపై చర్చించాలనే దానిపైనా పవన్ పలు సూచనలు చేసారు.ఇప్పటికే రెండు పార్టీలు కమిటీలు ఏర్పాటు చేసాయి…రాబోయే రోజుల్లో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ కమిటీల జేఏసీ నిర్నయం తీసుకోనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..