Janasena Party: రూ. 30 కోట్ల స్కామ్ అంటూ మంత్రులపై ఆరోపణలు.. ప్రమాణం చెయ్యాలంటూ జనసేన నేత సవాల్..

Janasena Party: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పై జనసేన పార్టీ అధికార..

Janasena Party: రూ. 30 కోట్ల స్కామ్ అంటూ మంత్రులపై ఆరోపణలు.. ప్రమాణం చెయ్యాలంటూ జనసేన నేత సవాల్..
Potina Mahesh

Updated on: Jul 19, 2021 | 1:53 PM

Janasena Party: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరూ కలిసి రూ. 30 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. దీనికి సంబంధించి బహిరంగ సవాల్ విసిరారు. సోమవారం నాడు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన పోతిన మహేష్.. టెక్స్‌స్టైల్ పార్క్ పేరుతో మంత్రులు శ్రీనివాస్, గౌతమ్ రెడ్డిలు రూ. 30 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తన ఆరోపణలను అబద్ధమైతే.. విజయవాడ కనక దుర్గమ్మపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

మంత్రి వెల్లంపల్లికి, ప్రభుత్వ జీవో తో లబ్ధి పొందిన సంస్థకు, అందులోని భాగస్వాములకు సంబంధం లేదని దుర్గమ్మపై ప్రమాణం చేయాలన్నారు. వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇంద్రకీలాద్రి వద్దకు రావాలని, తప్పు చేయకుంటే ధైర్యంగా ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మపై ప్రమాణం చేయాలని పోతిన మహేష్ బహిరంగ సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే ధైర్యం మంత్రులకు ఉందా? అని అన్నారు. తాను అన్న ప్రకారం వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు దుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకుంటానని చెప్పారు.

Also read:

Hyderabad: అమీర్‌పేట్‌లో దారుణం.. ‘నా ప్రాణం నువ్వు’ అంటూనే తన ప్రాణం తీసుకున్న యువకుడు..

L Ramana – KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎల్ రమణ ప్రశంసల జల్లు.. కారణమేంటంటే..

Chandrababu: భగ్గమంటున్న ‘జల’ వివాదం.. అయినా నోరు మెదపని చంద్రబాబు.. అసలు కారణం అదేనా?..