Jana Sena: పవన్ పోటీపై సర్వత్రా ఉత్కంఠ.. ఈ నియోజకవర్గంపై కన్నేసిన జనసేనాని..?

పవన్‌ పోటీ చేసేది పిఠాపురం నుంచా.. భీమవరం నుంచా..? ఈసారి గెలుపు కాదు.. భారీ మెజార్టీయే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నారు జనసేనాని. జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరికి షిఫ్ట్‌ అవడం ఖాయంగా తెలుస్తోంది. ఈసారి ఒకచోట నుంచి మాత్రమే పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కంటే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంవైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారట పవన్ కళ్యాణ్. ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించినట్లు జనసేన నేతలు చర్చించుకుంటున్నారు.

Jana Sena: పవన్ పోటీపై సర్వత్రా ఉత్కంఠ.. ఈ నియోజకవర్గంపై కన్నేసిన జనసేనాని..?
Pawan Kalyan

Updated on: Feb 28, 2024 | 3:26 PM

పవన్‌ పోటీ చేసేది పిఠాపురం నుంచా.. భీమవరం నుంచా..? ఈసారి గెలుపు కాదు.. భారీ మెజార్టీయే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నారు జనసేనాని. జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి నుంచి తూర్పుగోదావరికి షిఫ్ట్‌ అవడం ఖాయంగా తెలుస్తోంది. ఈసారి ఒకచోట నుంచి మాత్రమే పవన్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కంటే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంవైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారట పవన్ కళ్యాణ్. ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించినట్లు జనసేన నేతలు చర్చించుకుంటున్నారు. పిఠాపురం నుంచి పవన్‌ పోటీ చేస్తే అది కాకినాడ ఎంపీ అభ్యర్థికీ ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌గా ఉదయ్ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. పవన్‌ పోటీ చేస్తే టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వర్మ సహకరిస్తారా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పవన్‌ పిఠాపురానికి మారితే.. మరి భీమవరం అభ్యర్థి ఎవరు?. భీమవరం సీటు జనసేన ఖాతాలోనే ఉంటుందా? ఉంటే ఎవరిని బరిలోకి దించుతారు? అనే ప్రశ్నలపై ఆశావాహుల్లో ఆందోళన కలిగిస్తోంది. పవన్‌.. పిఠాపురం నుంచి పోటీ చేస్తారోలేదో ఇంకా అధికారిక ప్రకటన రానేలేదు. గానీ భీమవరం టికెట్‌ కోసం అప్పుడే జనసేనలో రేస్‌ మొదలైంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన పులపర్తి రామాంజనేయులు.. జనసేన టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్‌ పోటీ చేసే స్థానంపై ఈరోజు లేదా రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..