జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర 3వ విడత షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్ట్ 10 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈసారి విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. ఆగస్ట్ 19 వరకూ వారాహి యాత్ర జరగనుంది. తొలి, మలి విడత యాత్రలు వెంటవెంటనే చేపట్టిన పవన్ కళ్యాణ్… 3వ విడతకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇంతకుముందు విడతల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలు టార్గెట్ గా ముందుకెళ్లిన పవన్.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 సీట్లు గెలవాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
ఉభయగోదావరి జిల్లాలు పూర్తి చేసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ వారాహి యాత్ర.. ఉత్తరాంధ్ర వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ముందుగానే విశాఖ టార్గెట్‌గా తన ధాటి పెంచారు పవన్. వైసీపీ పాలనలో విశాఖలో క్రైం రేటు పెరిగిపోయిందన్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా కబ్జా చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైజాగ్‌లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. వారాహి యాత్ర తర్వాత పార్టీ పెద్దఎత్తున పుంజుకోవాలి, శ్రేణులు ఆ తరహాలో పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు.
దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. విశాఖకు ప్రస్తుతం జరుగుతున్న మేలు, గతంలో జరిగిన నష్టాన్ని పవన్ చెప్పాలన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందనే నమ్మకంతోనే పారిశ్రామిక వేత్తలు తరలి వస్తున్నారన్నారు. తాము చేస్తున్న అభివృద్ధితో ఏపీకి 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు.
మూడవ దశ జనసేన వారాహి విజయ యాత్ర
ఆగస్టు 10 నుండి విశాఖపట్నంలో..#VarahiVijayaYatra pic.twitter.com/Oy1of6YVWG
— JanaSena Party (@JanaSenaParty) August 3, 2023
మరో వైపు రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి కల్గించాలన్నారు పవన్. వైసీపీ అధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు, మనమే లాక్కోవాలంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్.
దీనికి పోసాని రూపంలో కౌంటర్లు వచ్చాయి. అసలు చంద్రబాబును సీఎంను చేయడమే పవన్ టార్గెట్ అంటూ కామెంట్ చేశారు పోసాని.
పవన్ వారాహి యాత్ర మూడో దశకు ముందు ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.
వైసీపీ రాక్షస పాలన నుంచి రక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరచిపోవచ్చు
• సామాన్యులకు రాజకీయాలెందుకు అనేది జగన్ భావన
• అన్నీ ఆలోచించే వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడాను
• సర్వేలు, నివేదికల ఆధారంగా ఎన్నికలకు వెళతాం
• వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయి… జగన్ తన… pic.twitter.com/peBcFDtX5e
— JanaSena Party (@JanaSenaParty) August 4, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..