టమాటా రైతును మించిన జాక్ పాట్ కొట్టిన రైతులు.. రికార్డు స్థాయిలో ఈ పంటకు మార్కెట్ ధర

రెండు నెలల క్రితం వరకు అప్పుడప్పుడు తప్ప కన్నీరు మాత్రమే మిగిలేది టమోటో రైతుకు.. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రోడ్డుపైనే టన్నుల కొద్దీ సరుకును రోడ్డుపై పడేసిన సందర్భాలెన్నో.. టమోటా రైతు కష్టాన్ని తీర్చిన నాధుడే లేదు.. అలాంటిది రైతుకు మంచి రోజులొచ్చాయి. ఒక్కరోజు లో టమోటా రైతులు లాక్షాది కారులు అవుతున్నారు.. కానీ వాస్తవానికి..

టమాటా రైతును మించిన జాక్ పాట్ కొట్టిన రైతులు.. రికార్డు స్థాయిలో ఈ పంటకు మార్కెట్ ధర
Tobacco Crop
Follow us
Ch Murali

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 04, 2023 | 10:05 PM

నెల్లూరు, ఆగస్టు 4: రెండు నెలల క్రితం వరకు అప్పుడప్పుడు తప్ప కన్నీరు మాత్రమే మిగిలేది టమోటో రైతుకు.. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రోడ్డుపైనే టన్నుల కొద్దీ సరుకును రోడ్డుపై పడేసిన సందర్భాలెన్నో.. టమోటా రైతు కష్టాన్ని తీర్చిన నాధుడే లేదు.. అలాంటిది రైతుకు మంచి రోజులొచ్చాయి. ఒక్కరోజు లో టమోటా రైతులు లాక్షాది కారులు అవుతున్నారు.. కానీ వాస్తవానికి ఇప్పుడున్న ధరలను బట్టి టమోటో రైతు లక్షాధికారి అంటున్నారు కానీ మేము ఏళ్ల తరబడి కోల్పోయిన కష్టం ముందు ఇది పెద్ద లాటరీ కాదని అంటున్న రైతులు ఉన్నారు.

అదలా ఉంచితే టమోటో పంటకు మాత్రం మాంచి గిరాకీ ఉంది ప్రస్తుతం..అలాగే మరో రైతు కూడా ఇపుడు జాక్ పాట్ కొట్టాడు. ఇప్పటి దాకా లేని రికార్డు స్థాయిలో ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో పొగాకు రైతులు కూడా లక్షాది కారులు అవుతున్నారు…కిలో పది రూపాయలు కూడా పలకని టమోటా 200 దాటినట్లు నిన్న మొన్నటి వరకు తక్కువ ధర పలికిన పొగాకు ఏకంగా ప్రస్తుతం కిలో రూ.270 పలుకుతుంది.ఇప్పటి వరకు కిలో 179 మాత్రమే అత్యధికంగా పలికిన పొగాకు ప్రస్తుతం కేజీ రూ 270 కి చేరడంతో ఇప్పటి వరకు టమోటా రైతుల్లో ఉన్న ఆనందం ఇప్పడు పొగాకు రైతుల్లో కనిపిస్తుంది.

నెల్లూరు జిల్లా లో పొగాకు ధర రికార్డ్ స్థాయి కి చేరింది గడిచిన పదేళ్లలో ఎప్పడు పలకని ధర ఇప్పడు పలకడంతో పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2022, 2023 సంవత్సరం పంటకు సంబంధించి గురువారం తో ముగిసింది.ఆత్మకూరు పరిధిలోని డీసీ పల్లి పొగాకు కొనుగోలు కేంద్రం రికార్డ్ స్థాయి లో ధరకు పొగకును ఐటీసీ కంపెనీ కొనుగోలు చేసింది.ఇప్పటి వరకు రాని రికార్డ్ స్థాయి ధర పొగాకు పలకడంతో పంట మరింత సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అలాగే గత ఏడాది రూ లక్ష గా ఉన్న పొగాకు బ్యారేన్ ఇప్పడు 50వేలు పెరిగి రు.1.50 లక్షలకు చేరడంతో రైతుల సాగుకు సిద్ధం అవుతున్నారు.అయితే రానున్న ఏడాది ఇదే ధర పలుకుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే గత పదేళ్లలో రాని ధర రావడం తో రైతులు ఖచ్చితంగా ధర పెరుగుతుందని భావిస్తున్నారు.నెల్లూరు జిల్లా లోని డీ సి పల్లికి పొగాకు కేంద్రం అనే పేరు ఉంది. నెల్లూరు జిల్లా లో సుమారు 22 మండలాలకి చెందిన రైతులు పొగాకు సాగు చేస్తున్నారు.

చేతిలో పెట్టుబడి లేక పోయినా అప్పులు చేసి పంటను పండించిన పొగాకు రైతులు ఇప్పటి వరకు అరా కోర ఆదాయంతో పంటలు సాగు చేశారు.అయితే మరి కొంత మంది పొగాకు పంటలో అనుకున్న స్థాయిలో ఆదాయం లేదని ప్రత్యామ్నాయ పంటలు సాగుపై ఆసక్తి చూస్తున్నారు.అయితే 2022.2023 కి సంబంధించి కిలో పొగాకు ఉన్న ధర కంటే వంద రూపాయలు పెరగడంతో అందరి చూపు మళ్ళీ పొగాకు పంట పై పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.