Pawan Kalyan: ఇప్పటికైతే నేనొక ఫెయిల్యూర్ పొలిటిషియన్‌.. రాజకీయ ప్రస్థానంపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు

తన రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ నంటూ తన పొలిటికల్‌ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: ఇప్పటికైతే నేనొక ఫెయిల్యూర్ పొలిటిషియన్‌.. రాజకీయ ప్రస్థానంపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan
Follow us

|

Updated on: Dec 03, 2022 | 10:25 PM

తన రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ నంటూ తన పొలిటికల్‌ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్ అకౌంం‌టెంట్స్‌ ఆఫ్ ఇండియా సదస్సుకు పవన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌ ..గెలుపైనా, ఓటమైనా రెండూ గమనాలే తప్ప గమ్యాలు కాదన్నారు. అనవసరంగా గెలుపోటములను అతిగా తలకు ఎక్కించుకోవద్దని సూచించారు. అప్పుడే అనుకున్న అసలు టార్గెట్ రీచ్ కాగలమంటూ విద్యార్థులను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ అంటూ చెప్పుకొచ్చారు. ఓటమి అంటూనే, అదే విజయానికి సగం పునాది అని పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆడిటోరియం హోరెత్తింది.

‘డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దు. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి’ అని ఈ సందర్భంగా విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు పవన్‌ కల్యాణ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..