Pawan Kalyan: దటీజ్‌ పవన్‌ కల్యాణ్‌.. పోలీస్‌ అధికారి పరిస్థితి చలించిపోయిన పవర్‌ స్టార్‌.. ఎనర్జీ డ్రింక్‌ ఇచ్చి మరీ..

|

May 12, 2023 | 6:20 AM

మండు వేసవిలో ఎండలు భగభగా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి రోడ్ల మీదకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. అలాంటిది మండు టెండల్లో నిత్యం రోడ్ల మీద విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. నిత్యం వచ్చి పోయే వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ఇబ్బందులు పడుతుంటారు. ఇక రాజకీయ నాయకుల పర్యటనలు ఉంటే వారి అవస్థలు దేవుడికే ఎరుక.

Pawan Kalyan: దటీజ్‌ పవన్‌ కల్యాణ్‌.. పోలీస్‌ అధికారి పరిస్థితి చలించిపోయిన పవర్‌ స్టార్‌.. ఎనర్జీ డ్రింక్‌ ఇచ్చి మరీ..
Pawan Kalyan
Follow us on

మండు వేసవిలో ఎండలు భగభగా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి రోడ్ల మీదకు రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. అలాంటిది మండు టెండల్లో నిత్యం రోడ్ల మీద విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. నిత్యం వచ్చి పోయే వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ఇబ్బందులు పడుతుంటారు. ఇక రాజకీయ నాయకుల పర్యటనలు ఉంటే వారి అవస్థలు దేవుడికే ఎరుక. ఈక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ కోనసీమ జిల్లాల పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన బందోబస్తులో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు అధికారి తీవ్ర అలసటకు గురయ్యాడు. అతని పరిస్థితిని గమనించిన పవన్‌ వెంటనే ఎనర్జీ డ్రింకును అందించారు. అది తీసుకున్న పోలీస్‌ అధికారి వెంటనే ఆ డ్రింక్ సేవించారు. కాస్త రిలాక్స్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ మంచి మనసును మెచ్చుకుంటూ ‘దటీజ్‌ పవర్‌ స్టార్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌. కొత్తపేట, పి.గన్నవరం, తదితర నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అన్నదాతలకు భరోసా ఇస్తున్నారు. ఈక్రమంలో పవన్‌ పర్యటనకు జనసేన నాయకులు, అభిమానులు భారీగా తరలిచ్చారు. దీంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే ఎండ ఎక్కువగా ఉండడంతో అభిమానులతో పాటు విధుల్లో ఉన్న పోలీసులు కూడా బాగా అలసిపోయారు. . ఈ క్రమంలో పవన్‌ కాన్వాయ్‌కు సమీపంలో విధులు నిర్వహిస్తోన్న పి. గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్.. వేడిమి చెమటలు కక్కుతూ చాలా అలసటగా కనిపించారు. ఇది గమనించిన పవన్‌ వెంటనే సీఐకు ఎనర్జీ డ్రింక్‌ అందించారు. దీంతో కాస్త ఉపశమనం చెందారు సదరు పోలీస్‌ అధికారి. ఈక్రమంలో పవన్‌ ఎనర్జీ డ్రింక్‌ అందిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదిరా పవన్‌ కల్యాణ్‌ అంటూ జనసేన నాయకులు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..