శ్రీకాళహస్తి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడంపై ఆయన సిరియస్ అయ్యారు. శాంతియుతంగా ధర్నా చేస్తు ఎందుకు కొట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అలాగే జనసేన పార్టీపై ఇటీవల వైసీపీ నేతలను ఆరోపణలను కూడా పవన్ ఖండించారు. టీడీపీ పార్టీకి జనసేన బీ టీం అంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే వాళ్ల ఆరోపణలను పవన్ కల్యాణ్ కొట్టి పారేశారు. మరోవైపు ప్రజలకు సేవ చేసేందుకు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండగా.. మళ్లీ గ్రామ వాలంటీర్లు ఎందుకు అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీపై కూడా పవ్ కల్యాణ్ స్పందించారు. అప్పట్లో షర్మిల పార్టీ పెట్టినప్పుడు శుభాకాంక్షలు చెప్పి ఆహ్వానించామని అన్నారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తు్న్నారని ఈ మధ్య వింటున్నామని తెలిపారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదని పేర్కొన్నారు. సైద్ధాంతిక బలం ఉంటేనే పార్టీని నడపగలం అని వ్యాఖ్యానించారు. అర్జెంటుగా అధికారంలోకి రావాలనుకుంటే అప్పుడే నేను కాంగ్రెస్‌లోకి వెళ్లేవాడ్ని అని పేర్కొన్నారు. సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే దాని కోసం చచ్చిపోవాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం