AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు సంఘీభావం.. మంగళగిరి కార్యాలయంలో జనసేనాని నిరసన దీక్ష..

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఉక్కు వాణిని వినిపించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ ఉక్కు కోసం ఒక్కరోజు దీక్ష చేయబోతున్నారు.

Pawan Kalyan: స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు సంఘీభావం.. మంగళగిరి కార్యాలయంలో జనసేనాని నిరసన  దీక్ష..
Pawan Kalyan
Sanjay Kasula
|

Updated on: Dec 12, 2021 | 7:33 AM

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మళ్ళీ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని చాటనున్నారు. విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ జనసేనాని ఒక్కరోజు దీక్ష చేయనున్నారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పవన్ కళ్యాణ్ దీక్షను చేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో AP ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

తాను గతంలో విశాఖ ఉక్కు పై అఖిలపక్షాన్నీ ఏర్పాటు చేసి.. ఢిల్లీ తీసుకుని వెళ్లాలని చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని అన్నారు. అందువల్లనే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం తమ పార్టీ తరపున పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలను ఢిల్లీ తెలుసుకుని వెళ్లి.. మన గళం వినిపించాలంటూ జనసేనాని డిమాండ్ చేశారు.

కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పరిశ్రమ ప్రయివేటీకరణను నిరసిస్తూ.. గత 300 రోజులుగా నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే అన్ని రకాల చర్యలను కూడా ప్రారంభించేసింది.

దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కార్మికులకు మద్దతుగా డిసెంబర్ 12న మంగళ గిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నిరాహార దీక్ష జరుగుతుందని జనసేన పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్​తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి:

Chanakya Niti: ఈ బంధాలను వెంటనే వదిలివేయండి.. కీలక వివరాలను వెల్లడించిన చాణక్యుడు..

Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..!

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు