Andhra Pradesh: పకడ్బందీగా జగనన్న గోరుముద్ద పథకం.. మరింత రుచికరంగా మద్యాహ్నం భోజనం..
జగనన్న గోరుముద్ద మరింత రుచికరంగా మారింది. ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచడంతో మెనూలో ఛేంజెస్ చేశారు నిర్వాహకులు. కాకినాడ జిల్లాలో జగనన్న గోరుముద్ద పథకం పకడ్బందీగా అమలవుతోంది.
జగనన్న గోరుముద్ద మరింత రుచికరంగా మారింది. ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచడంతో మెనూలో ఛేంజెస్ చేశారు నిర్వాహకులు. కాకినాడ జిల్లాలో జగనన్న గోరుముద్ద పథకం పకడ్బందీగా అమలవుతోంది. మరింత రుచికరంగా పిల్లలకు భోజనం అందిస్తున్నారు నిర్వాహకులు. రోజుకో మెనూ చొప్పున స్టూడెంట్స్ ప్రొటీన్ ఫుడ్ పెడుతున్నారు. మధ్యాహ్నం భోజన పథకం కింద 463 ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న గోరుముద్దను అందిస్తోంది అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ. రుచికరమైన, నాణ్యమైన ఆహారం పెట్టేందుకు కత్తిపూడి, కందరాడ గ్రామాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్స్‌ను సైతం నిర్మించారు. ఇక్కడే ఆహారాన్ని సిద్ధంచేసి వాహనాల్లో స్కూళ్లకు సప్లై చేస్తున్నారు నిర్వాహకులు. సీఎం జగన్ ఆలోచనల మేరకు రోజుకో మెనూతో భోజనం పెడుతున్నారు.
ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచడంతో మరింత రుచికరంగా ప్రొటీన్ ఫుడ్ అందిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. భోజనంతోపాటు ప్రతి రోజూ గుడ్డు, రెండ్రోజులకోసారి వేరుశెనగ పట్టీ కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రోజుకో మెనూను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సోమవారం ఒక మెనూ, మంగళవారం మరో మెనూ, బుధవారం బిర్యానీ, గురువారం కిచిడి, శుక్రవారం ఆకుకూర పప్పు, శనివారం సాంబార్ అండ్ స్వీట్ పొంగల్. ఇలా, శుచీశుభ్రంతో మరింత రుచికరంగా, నాణ్యమైన భోజనం పెడుతుండటంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు స్టూడెంట్స్.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..