Aditya-L1: సోలార్ మిషన్‌ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్.. చెంగాళమ్మ అమ్మవారికి ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు..

Aditya-L1 Solar Mission: చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.. చంద్రుడిపై సుదీర్ఘ కాలంగా ప్రయోగాలు చేపట్టిన ఇస్రో.. ఇప్పటిదాకా అనేక కొత్త విషయాలను ప్రపంచానికి తెలియజేసింది.. ఇప్పుడు సూర్యుడిపై కీలక ప్రయోగానికి సిద్ధమైంది.. సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది..

Aditya-L1: సోలార్ మిషన్‌ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్.. చెంగాళమ్మ అమ్మవారికి ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు..
Aditya L1 Solar Mission

Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 01, 2023 | 6:28 PM

Aditya-L1 Solar Mission: చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.. చంద్రుడిపై సుదీర్ఘ కాలంగా ప్రయోగాలు చేపట్టిన ఇస్రో.. ఇప్పటిదాకా అనేక కొత్త విషయాలను ప్రపంచానికి తెలియజేసింది.. ఇప్పుడు సూర్యుడిపై కీలక ప్రయోగానికి సిద్ధమైంది.. సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.. ఆదిత్య-L1 భారతదేశపు మొట్టమొదటి సౌర అంతరిక్ష అబ్జర్వేటరీ రాకెట్ PSLV-C57 శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ వద్ద సిద్దంగా ఉంది. ఆదిత్య ఎల్1 ప్రయోగం కోసం శుక్రవారం కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. అయితే, రాకెట్ ప్రయోగానికి ముందు.. సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాధ్ ప్రత్యేక పూజలు చేశారు. ఇస్రో చేపట్టే ప్రతి ప్రయోగం ముందు రోజు ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉపగ్రహం నమూనాను అమ్మవారి పాదాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేపడతారు. ఆదిత్య ఎల్-1 ప్రయోగం ముందు ఇస్రో చైర్మన్ సోమనాధ్ పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారిని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సోమనాధ్ కొన్ని కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 PSLV.. సి57 రాకెట్ ప్రయోగం (సెప్టెంబర్ 2, 2023) శనివారం ఉదయం 11.50 గంటలకు ఉంటుందని ఇస్రో చైర్మన్ సోమనాధ్ తెలిపారు. ప్రయోగం ద్వారా సూర్యుని వద్దకు పంపనున్న ఆదిత్య L1 ఉపగ్రహం కొత్త విషయాలను పరిశోధించేందుకు రూపొందించినట్లు తెలిపారు. PSLV. C57 రాకెట్ ప్రయోగానికి ముందు రోజు మధ్యాహ్నం 11.50 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందన్నారు.. సూర్యుని వద్ద ఉన్న L1 RANGE పాయింట్ వద్ద ఆదిత్య L1 ఉపగ్రహం పరిశీలన చేస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ISRO

ఆదిత్య-L1 యొక్క లక్ష్యం ఏమిటి..

ఆదిత్య-L1 మిషన్ సుర్యుడి చుట్టూ ఉన్న కక్ష్య నుంచి సూర్యుడిని అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని బయటి పొరలు, వేర్వేరు వేవ్‌బ్యాండ్‌లలో గమనించడానికి ఏడు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. లక్ష్యాలలో సౌర కరోనా, భౌతిక శాస్త్రం, దాని తాపన విధానం, సౌర గాలి, సౌర వాతావరణం, ఉష్ణోగ్రత అనిసోట్రోపి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (CME), మంటలు, సమీపంలో- భూమి అంతరిక్ష వాతావరణం లాంటివి అధ్యయనం చేయనుంది. VELC వంటి కరోనాగ్రాఫ్ అనేది సూర్యుడి నుంచి కాంతిని అడ్డుకునే పరికరం, తద్వారా అన్ని సమయాల్లో చాలా మందమైన కరోనాను చిత్రించగలదని బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తెలిపింది.

ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి..

భారతదేశపు తొలి సోలార్ మిషన్‌ ప్రయోగాన్ని ISRO వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు: https://isro.gov.in, అంతేకాకుండా సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫారమ్‌లలో, యూట్యూబ్, టీవీ9లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

త్వరలో గగన్‌యాన్ టెస్ట్ లాంచ్..

కాగా.. చంద్రయాన్..3 సంబంధించిన లాండర్, రోవర్ విజయవంతంగా పని చేస్తున్నాయని ఇస్రో చైర్మన్ సోమనాధ్ పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో గగన్ యాన్ టెస్ట్ లాంఛ్ ఉంటుందన్నారు.. త్వరలో SSLV రాకెట్ ప్రయోగం చేపడుతామని ఇస్రో చైర్మన్ DR సోమనాధ్ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..