అమాయకుడు అనుకుంటే పొరపాటే.. ఇతను ఏం చేశాడో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో జనాలపై కత్తితో దాడి చేస్తున్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో దుండగుడిపై పట్టుకునేందుకు కాల్పుడు జరిపిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది.

అమాయకుడు అనుకుంటే పొరపాటే.. ఇతను ఏం చేశాడో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..
Ap Crime News

Edited By:

Updated on: Dec 22, 2025 | 10:39 PM

అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో జనాలపై కత్తితో దాడి చేస్తున్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే.. దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో దుండగుడిపై పట్టుకునేందుకు కాల్పుడు జరిపిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరవింద నగర్‌కు చెందిన నలుగురు స్నేహితుల మద్యం సేవించేందుకు ఒక ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వారి మధ్య వివాదం చెలరేగడంతో.. అజయ్ అనే యువకుడు రాజు అనే యువకుడిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక మిగతా స్నేహితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజయ్‌ కోసం గాలింపు చేపట్టారు.

అయితే అనంతపురం శివారు ఆకుతోటపల్లిలో నిందితుడు అజయ్ ఉన్నట్లు సమాచారం రావడంతో. అనంతపురం టు టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తన నిందితుడిని పట్టుకునేందుకు తనసిబ్బందితో బయల్దేరాడు. అజయ్ చెరుకు తోటలో దాక్కున్నట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో నిందితుడు అజయ్ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో సీఐ ఒక్కసారిగా గాల్లో కాల్పులు జరిపారు. అయినా అజయ్ వెనక్కి తగ్గలేదు.. మళ్లీ సీఐపై కత్తితో దాడి చేశాడు. ఇక చేసేదేమి లేక.. ఎస్‌ఐ అజయ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో అజయ్ అక్కడికక్కడే కుప్పకూలాడు.

ఇక వెంటనే అక్కడికి చేరుకున్న మిగతా సిబ్బంది. అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అజయ్‌తో పాటు ఎస్‌ఐను సైతం వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇక విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సీఐను పరామర్శించారు. పోలీసులపై తిరగబడిన నిందితుడు అజయ్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.