Andhra Pradesh: ఆలయ అర్చకుని ఇంట్లో తనిఖీలు.. జింక చర్మాన్ని చూసి పోలీసులు షాక్..

చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం అనుబంధ ఆలయమైన వరదరాజుల స్వామి ఆలయ అర్చకుల ఇంట్లో జింక చర్మం దొరకడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆ ఆలయంలో నిత్య అన్నదానం కార్యక్రమం ఉంటుంది.

Andhra Pradesh: ఆలయ అర్చకుని ఇంట్లో తనిఖీలు.. జింక చర్మాన్ని చూసి పోలీసులు షాక్..
Deer Skin

Updated on: Apr 09, 2023 | 8:39 AM

చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం అనుబంధ ఆలయమైన వరదరాజుల స్వామి ఆలయ అర్చకుల ఇంట్లో జింక చర్మం దొరకడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఆ ఆలయంలో నిత్య అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అయితే అందులో పనిచేస్తున్న పలువురు సిబ్బంది అన్నదానంలో నిత్యావసర వస్తువులు దొంగతనం చేసినట్లు అక్కడ ఉండేవారు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యనిర్వహణ అధికారి వెంకటేష్, మరికొందరు ఆలయ అధికారులు, సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే ఇద్దరు ప్రధాన వంటగాళ్లు, వారి సహాయకులు ఇళ్లల్లో కూడా తనిఖీలు నిర్వహించారు.

అనంతరం భారీగా నిత్యావసర వస్తువులు, బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆలయ అర్చకులు కృష్ణ మోహన్ నివాసంలో తనిఖీలు చేయగా వారిగి జింక చర్మం కనిపించి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ చర్మాన్ని స్వాధీనం చేసుకొని అర్చకులు కృష్ణ మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం ఈ విషయంపై రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..