Andhra Pradesh: 5,545 అడుగుల ఎతైన పర్వతంపై మువ్వన్నెల జెండా ఎగరవేసిన సైనికులు..
ఏపీలో ఎత్తైన పర్వతం పై మువ్వన్నెల జెండా ఎగురవేశారు ఆ ఆర్మీ జవాన్లు. సీతమ్మ పర్వతాన్ని అధిరోహించి జైహింద్ అంటూ నిన్నదించ్చారు. హర్ శిఖర్ తిరంగాలో భాగంగా ఇప్పటికే 22 చోట్ల వివిధ రాష్ట్రాల్లో పర్వతాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. అల్లూరి ఏజెన్సీకి వచ్చిన ఆ బృందానికి గిరిజనులు సాదర స్వాగతం పలికి.. వారితో ఆడి పాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి ఏజెన్సీ, హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీలో ఎత్తైన కొండ సీతమ్మ కొండ. ఇది ఏపీలోనే అత్యంత ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 5511 మీటర్ల ఎత్తు వరకు ఉంది ఈ కొండ.

ఏపీలో ఎత్తైన పర్వతం పై మువ్వన్నెల జెండా ఎగురవేశారు ఆ ఆర్మీ జవాన్లు. సీతమ్మ పర్వతాన్ని అధిరోహించి జైహింద్ అంటూ నిన్నదించ్చారు. హర్ శిఖర్ తిరంగాలో భాగంగా ఇప్పటికే 22 చోట్ల వివిధ రాష్ట్రాల్లో పర్వతాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. అల్లూరి ఏజెన్సీకి వచ్చిన ఆ బృందానికి గిరిజనులు సాదర స్వాగతం పలికి.. వారితో ఆడి పాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి ఏజెన్సీ, హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీలో ఎత్తైన కొండ సీతమ్మ కొండ. ఇది ఏపీలోనే అత్యంత ఎత్తైన పర్వతం. ఈ పర్వతం ఎత్తు 5,545 అడుగులు . అయితే ఈ కొండను అధిరోహించి మువ్వనాలు జెండా ఎగరవేసేందుకు సిద్ధమైంది ఆర్మీ బృందం. హర్ శిఖర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఆ బృందం పర్యటిస్తోంది.
పదిహేను మంది సభ్యుల బృందం.. ఇప్పటికే 22 రాష్ట్రాల్లో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణ్వీర్ సింగ్ ఆధ్వర్యంలో 15 మంది ఆర్మీ సభ్యులు బృందం.. దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది. దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలను ఎంచుకొని వాటిపై.. మువ్వన్నెల పతాకాన్ని ఎగురవిస్తున్నారు ఈ బృందం. ఇప్పటికే 22 రాష్ట్రాల్లో విజయవంతంగా ఇతని పర్వతాలను అధిరోహించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని.. ఎత్తైన పర్వతమైన సీతమ్మ కొండ గురించి తెలుసుకొని అక్కడకు చేరుకున్నారు. గంటన్నర వ్యవధిలో.. ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న సీతమ్మ కొండ శిఖరాన్ని తాకి.. అక్కడ జాతీయ జెండా రెవరపలాడించారు. హర్ శిఖర్ తిరంగా అంటూ నినందించారు. ఎటువంటి కార్యక్రమాలతో జాతీయ ఐక్యత, జాతీయ భావాలు పెరుగుతాయని.. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇప్పటికే 22 రాష్ట్రాల్లో ఎత్తయిన పర్వతాలపై జెండాను ఎగురవేశామని. వచ్చే నెల 15లోగా మరో ఆరు రాష్ట్రాల్లో హర్ శిఖర్ తిరంగా ను పూర్తి చేస్తామని అంటున్నారు కల్నల్ రణవీర్ సింగ్.
సాంప్రదాయ బద్ధంగా గిరిజనుల స్వాగతం.. అంతకుముందు.. హుకుంపేట మండలంలో ఓలుబెడ్డ స్థానికులు ఆర్మీ బృందానికి స్థానిక గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనుకోని అతిధులు తమ గ్రామానికి రావడంతో.. స్థానిక అడవి బిడ్డలు ఉబ్బి తబ్బయ్యారు. సాదరంగా ఆహ్వానం పలికి.. సరదాగా ప్రకృతి అందాలు చూపించి.. టూర్ సక్సెస్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అందుకే వారి ఆదరాభిమానాలు, ఆప్యాయతకు ఆ సాహస ఆర్మీ బృందం సహృదయంతో కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ ఆర్మీ బృందం దేశవ్యాప్తంగా పర్యటించి ఇలా పర్వతాలపై జాతీయ జెండా ఎగరవేయడం చాలా గొప్ప విషయమని స్థానికులు చెబుతున్నారు.