IPL 2025: ఐపీఎల్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్! టీమిండియా క్రికెటర్ సర్‌ప్రైజ్ స్టేట్‌మెంట్
ఐపీఎల్ మెగా సీజన్ ప్రారంభమైంది. CSK వర్సెస్ MI మధ్య మ్యాచ్‌కు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్నంత ఆసక్తి ఉందని హర్భజన్ సింగ్ అన్నారు. రెండు టీమ్స్ చరిత్రలో ఐదు ట్రోఫీలు గెలిచిన ఛాంపియన్స్. ధోని, రోహిత్ శర్మ ప్రజెన్స్ తో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు అందిస్తుంది. చెన్నైలోని చెపాక్‌లో మ్యాచ్ ఆదివారం జరగనుంది.

ఐపీఎల్ మెగా సీజన్ మొదలైపోయింది. ఇక క్రికెట్ అభిమానులకు పండగే పండగ. ప్రతి రోజు మ్యాచ్‌లు, ఫోర్లు సిక్సర్ల వర్షం, వికెట్ల పంట, స్టార్ క్రికెటర్ల బాదుడు, యువ బ్యాటర్ల దూకుడు, ఫీల్డర్ల విన్యాసాలు, మధ్య మధ్య గొడవలు అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ అంటేనే క్రికెట్ హంగామా. ఎండా కాలం, వానా కాలం, వర్షా కాలం లాగా.. క్రికెట్ అభిమానులకు ఇది ఐపీఎల్ కాలం. మొన్నటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీతో వంద కోట్ల మందికి పైగా ఇండియన్స్ ఒక్కటిగా ఉంటే.. ఇప్పుడు పది గ్రూపులుగా విడిపోయారు. అందుకు కారణం ఏంటో మీకు తెలిసిందే.. ఐపీఎల్‌లో పది టీమ్స్.
సో ఇప్పుడు ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం కాదు.. ఏకత్వంలో భిన్నత్వం. అయితే ఈ పది గ్రూపుల్లో ఓ ఐదు గ్రూపులు మాత్రం చాలా పెద్దవి. అదేనండి ఐదు టీమ్స్‌కు ఫ్యాన్ బేస్ ఎక్కువ అని. వాటిలో ఆర్సీబీ, సీఎస్‌కే, ముంబై, ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ టీమ్స్ ఉంటాయి. మిగతా టీమ్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నా.. వీటితో పోల్చుకుంటే కాస్త తక్కువనే చెప్పాలి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే మరి ఈ పది టీమ్స్ కాకుండా.. మధ్యలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఎందుకొచ్చిందని అనుకుంటున్నారు. ఓ టీమిండియా క్రికెటర్ ఐపీఎల్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను తలపించే ఓ మ్యాచ్ ఉందని చెప్పాడు. ఆ మ్యాచ్ ఏదో కాదు.. సీఎస్‌కే వర్సెస్ ఎంఐ.
ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్‌కు.. భారత్, పాక్ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ ఉందని భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేలేదు. ఎందుకంటే.. ఈ రెండు టీమ్స్ కూడా ఛాంపియన్స్ టీమ్, ఇప్పటికే చెరో ఐదు ట్రోఫీలు గెలిచి ఉన్నాయి.. ఓ టీమ్‌కు ధోని, మరో టీమ్‌కు రోహిత్ పెద్ద దిక్కులుగా ఉన్నారు. ముంబైతో మ్యాచ్ అనగానే చెన్నై ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు, అలాగే ముంబై ఫ్యాన్స్ కూడా సేమ్. రెండు బెస్ట్ టీమ్స్ మధ్య జరిగే పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్‌కు కనులవిందును అందిస్తుంది. ఈ రెండు టీమ్స్ ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో భజ్జీ ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..