టెంపుల్ సిటీ ఇదేం పని.. గణేష్ మండపంలో హోరెత్తిన అసభ్యకర రికార్డింగ్ డాన్స్‌లు..!

| Edited By: Balaraju Goud

Sep 10, 2024 | 3:58 PM

టెంపుల్ సిటీ తిరుపతిలో వినాయక మండపాలు భక్తి భావాన్నే కాదు హోరెత్తించే డ్యాన్సులకు వేదికలు అయ్యాయి. దాదాపు 1000 కి పైగా గణేష్ మండపాలు తిరుపతిలో ఏర్పాటు కాగా చాలా చోట్ల యువత వెర్రి చేష్టలు శృతి మించాయి. భక్తులను ఆకర్షించేందుకు విభిన్న కళలను ప్రదర్శిస్తున్నారు.

టెంపుల్ సిటీ ఇదేం పని.. గణేష్ మండపంలో హోరెత్తిన అసభ్యకర రికార్డింగ్ డాన్స్‌లు..!
Recording Dance
Follow us on

టెంపుల్ సిటీ తిరుపతిలో వినాయక మండపాలు భక్తి భావాన్నే కాదు హోరెత్తించే డ్యాన్సులకు వేదికలు అయ్యాయి. దాదాపు 1000 కి పైగా గణేష్ మండపాలు తిరుపతిలో ఏర్పాటు కాగా చాలా చోట్ల యువత వెర్రి చేష్టలు శృతి మించాయి. భక్తులను ఆకర్షించేందుకు విభిన్న కళలను ప్రదర్శిస్తున్నారు.

తిరుపతిలో పోటా పోటీగా వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసిన భక్త మండళ్లు, భక్తుల్ని ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సప్తగిరి నగర్ యూత్ ఆధ్వర్యంలో 17 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా గణనాథుని మండపంలో రోజుకో కార్యక్రమాన్ని చేపట్టిన యూత్ అసభ్యకర నృత్యాలతో అదరగొట్టారు. స్థానికంగా ఉన్న ఒక డాన్స్ మాస్టర్ తన బృందంతో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి రికార్డింగ్ డాన్సులు వేయించారు.

వినాయక చవితి మూడో రోజు నుంచే తిరుపతి ప్రారంభమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సోమవారం(సెప్టెంబర్ 9) రాత్రి కొన్ని మండపాల నుంచి కదిలిన గణనాథుల శోభాయాత్ర శోభాయమానంగా జరగ్గా, మరోవైపు మండపాల్లో నిర్వహించిన కార్యక్రమాలు అంతకంటే ఎక్కువగానే ఆకట్టుకున్నాయి. సప్తగిరి నగర్ లోని గణేష్ మండపంలో డీజే ప్రోగ్రాం రికార్డింగ్ డాన్స్‌లతో అదరగొట్టగా చూసిన జనం మాత్రం ఇబ్బంది పడ్డారు.

వినాయకుడి మండపంలో గణనాథుడి విగ్రహం ముందే రికార్డ్ డ్యాన్స్ చేసిన యువతీయువకులు పొట్టి డ్రెస్సులతో అసభ్యకర నృత్యాలు చేశారు. దీంతో స్థానిక మహిళలకు ఇబ్బంది కలగ్గా, గణేష్ మండపాల్లో ఇలాంటి చేష్టలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించేందుకు అనుమతిస్తున్న
వర సిద్ధి వినాయక మహోత్సవ కమిటీ, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నాయి. భక్తి భావాన్ని పెంపొందించేలా ఉత్సవాలు నిర్వహించేందుకు చొరవ చూపాలని కోరుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..