Andhra Pradesh: అదృష్టం ఎవరి తలుపు కొడుతుందో.. ఎవరిని వెతుక్కుంటూ వస్తుందో.. ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణ ఈ గ్రామ వాలంటీర్‌ను చెప్పొచ్చు. గ్రామ వాలంటీర్‌గా ప్రస్థానం ప్రారంభించి ప్రకాశం జిల్లా, మార్టూరు మండల అధ్యక్షురాలిగా అధికారపీఠం ఎక్కనున్నారు భూక్యా శాంతా భాయి. వివరాల్లోకెళితే.. మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి తండా కు చెందిన శాంతాభాయి బీకాం, బీఈడి పూర్తిచేశారు. మార్టూరు తండాకు చెందిన ఇంజినీరింగ్ పట్టబద్రుడు బాణావత్ బాబు నాయక్‌తో ఆమెకు వివాహం జరిగింది. ప్రస్తుతం మార్టూరులో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. అయితే మార్టూరు ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావటంతో స్థానిక జనార్దన్ కాలనీ ప్రాదేశికం నుండి ఎంపీటీసీగా బరిలోకి దిగారు. టీడీపీకి చెందిన తన ప్రత్యర్థి పై 1,184 ఓట్ల భారీ మెజారిటీతో శాంతాభాయి గెలుపొందారు.
మండలంలోని 21మంది ఎంపీటీసీ లలో ఎస్టీ కేటగిరి కింద మరెవ్వరూ అభ్యర్థులు లేకపోవటంతో మార్టూరు ఎంపీపీగా శాంతా భాయి ఎన్నిక లాంఛనంగా మారింది. మండలంలోని ఎంపీటీసీ లు అందరిలోకి ఈమే పిన్న వయస్కురాలు కావడం విశేషం. ఈ సందర్భంగా శాంతా భాయి మాట్లాడుతూ.. గత ఆగస్టు నెలలో ఆడపిల్లకు జన్మనిచ్చానని.. నెల తిరక్కుండానే ఎంపీపీ కాబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించడం నచ్చి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. మార్టూరు మండల ప్రజల అభివృద్ధికి పాటుపడతానని, ముఖ్యమంత్రి జగన్ ఆశయాలతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు.
Also read:
Tollywood Drugs Case : చివరికి చేరుకున్న ఈడీ విచారణ.. నేడు అధికారుల ముందుకు హీరో తరుణ్
Covishield Vaccine: అమెరికా వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక, కోవిషీల్డ్ తీసుకున్నవారికి అనుమతి
Ram Charan : ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చు చేస్తున్నారా..! చరణ్ శంకర్ మూవీ క్రేజీ అప్డేట్..