
Andhra Pradesh: ఆస్తుల కోసమో, అధికారం కోసమో, పగ, ప్రతికారాలు తీర్చుకోవటానికో హత్యలు చేయడం చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి పందుల కోసం హత్య చేశాడు. అది కూడా సొంత బావనే హతమార్చాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని చిలకలూరిపేట డైక్‌మెన్ కాలనీలో ఉండే కిల్లయ్య పందులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పట్టణానికే చెందిన కోటయ్య అలియాస్ బాలయ్య.. కిల్లయ్యకు బావమరిది అవుతాడు. గత కొంత కాలంగా కోటయ్యకు చెందిన పందులు మాయమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకుపోతున్నారు. అయితే తన పందులు పోవటానికి ప్రధాన కారకుడు బావ కిల్లయ్యే అని భావించాడు కోటయ్య. తన పందులను దొంగిలిస్తున్న కిల్లయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజూ కిల్లయ్య పందులు మేపుకోవటానికి శివ ప్రియా నగర్ వెళ్ళి వస్తుంటాడు. అక్కడే అతన్ని మర్డర్ చేయాలని కోటయ్య భావించాడు. ఈ విషయాన్ని అతని స్నేహితుడైన వెంకట సుబ్బారావుకి చెప్పాడు. కిల్లయ్యను చంపాలంటే తనకు మరొకరి సాయం కావాలని చెప్పాడు వెంకట సుబ్బారావు. సరేనన్న కిల్యయ్య.. అందుకు అవసరమైన డబ్బులిస్తానని చెప్పాడు. వెంకట సుబ్బారావు కోటప్పకొండకు చెందిన కనకరాజును ఒప్పించాడు. ఈ ముగ్గురూ కలిసి కిల్లయ్యను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. పక్కా పథకం ప్రకారం.. ఈ నెల 15వ తేదీన పందులు మేపుకోవటానికి శివ ప్రియా నగర్ వెళ్ళి వస్తున్న కిల్లయ్యపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతుడి సెల్ ఫోన్ తీసుకెళ్ళారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికతను ఉపయోగించి హత్య చేసిన ముగ్గురుని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read:
Viral Video: సింహం భయపడటం ఎప్పుడైనా చూశారా?.. చెట్టును పట్టుకుని ఎలా విలపించిందో ఓసారి చూడండి..
Viral Video: రైనో, అడవి దున్న మధ్య భీకర యుద్ధం.. వీడియో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే..
UP Polls 2022: యూపీలో మరింత హీటెక్కిన పొలిటికల్ వార్.. బీజేపీపై సంచలన కామెంట్స్ చేసిన అఖిలేష్..