AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: దారి మధ్యలో కాపు కాచి.. రాళ్లు, కత్తులతో దాడి చేసి.. యువకుడిపై దురాగతం

పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లు, కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య(Murder) చేశారు. దారి కాచి మరీ ఈ..

AP Crime: దారి మధ్యలో కాపు కాచి.. రాళ్లు, కత్తులతో దాడి చేసి.. యువకుడిపై దురాగతం
Iran Wife Murder
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2022 | 6:20 AM

Share

పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లు, కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య(Murder) చేశారు. దారి కాచి మరీ ఈ దురాగతానికి పాల్పడ్డారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా తిరుపూరు(Tiruvur) పట్టణంలోని సీతామహాలక్ష్మి కాలనీలో కృష్ణచైతన్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను ఆర్టీసీ బస్టాండ్‌ క్యాంటీన్‌లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. బుధవారం రాత్రి పనులు ముగించుకుని బైక్ పై వస్తుండగా దారి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి(Attack) చేశారు. కృష్ణచైతన్యను రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం వెనుక ఉన్న మరో వ్యక్తి భయంతో పరారయ్యాడు.

సమాచారం అందుకున్న నూజివీడు పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read

Health Tips: ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే, ఈ ఆహారాలను దూరం పెట్టండి..!

Viral Video: చిరుత వేట ఎలా ఉంటుందో చూసారా.. షాకింగ్‌ వీడియో మీకోసం

Digital News Round Up: ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రాముడు కాదా? | మహేశ్‌ సోదరి కిరాక్‌ డాన్స్‌.. లైవ్ వీడియో

తక్కువ ఇంధన లైట్ వెలిగిన తర్వాత కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది?
తక్కువ ఇంధన లైట్ వెలిగిన తర్వాత కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది?
గుంటనక్క పాక్ గుటుక్కుమంది.. ఫిబ్రవరి 15 భారత్‌తో మ్యాచ్ ఆడుతోంది
గుంటనక్క పాక్ గుటుక్కుమంది.. ఫిబ్రవరి 15 భారత్‌తో మ్యాచ్ ఆడుతోంది
జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా?
జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా?
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన..!
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన..!
కేవలం రూ.2000 SIPతో లక్షల రాబడి పొందవచ్చా?
కేవలం రూ.2000 SIPతో లక్షల రాబడి పొందవచ్చా?
వాలంటైన్స్ వీక్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు
వాలంటైన్స్ వీక్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు
పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే
పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే
కార్‌ షో రూమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
కార్‌ షో రూమ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
గ్రౌండ్‌జీరోకు పడిపోయిన గోల్డ్‌స్మిత్ బిజినెస్..
గ్రౌండ్‌జీరోకు పడిపోయిన గోల్డ్‌స్మిత్ బిజినెస్..
మళ్లీ జోరు మొదలైంది.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..
మళ్లీ జోరు మొదలైంది.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..