AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బెదిరించి తాళికట్టాడు.. అంతటితో ఆగకుండా బలవంతంగా.. 

వారిది ఇంటర్మీడియట్ చదువుకునే వయసు. అంటే టీనేజ్. తెలిసీ తెలియక చేసే తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీసే ముఖ్యమైన దశ. ఎట్రాక్షన్, ఫ్రెండ్షిప్ నెస్ ను ఆ యువకుడు ప్రేమనుకున్నాడు. ప్రేమిస్తున్నానని...

Andhra Pradesh: బెదిరించి తాళికట్టాడు.. అంతటితో ఆగకుండా బలవంతంగా.. 
Harassment
Ganesh Mudavath
|

Updated on: Nov 12, 2022 | 12:07 PM

Share

వారిది ఇంటర్మీడియట్ చదువుకునే వయసు. అంటే టీనేజ్. తెలిసీ తెలియక చేసే తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీసే ముఖ్యమైన దశ. ఎట్రాక్షన్, ఫ్రెండ్షిప్ నెస్ ను ఆ యువకుడు ప్రేమనుకున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె వద్దని చెప్పినా వినిపించుకోలేదు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి.. బాలిక మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఇక నువ్వు నా భార్యవి అంటూ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పెను సంచలనంగా మారింది. అనంతపురం నగరానికి చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోంది. ఆమెకు తనతో పాటు చదువుకునే హేమంత్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు బాలికతో సన్నిహితంగా ఉండేవాడు. బాలిక కూడా చనవుగా ఉండటంతో ప్రేమ పేరుతో వేధించడం స్టార్ట్ చేశాడు. విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేనపుడు వెళ్లి, ప్రేమించక పోతే తల్లిని, చెల్లిని చంపుతానని బెదిరించేవాడు. భయపడిన ఆమె అతనితో మాట్లాడేది. దీన్ని అదునుగా తీసుకుని ఈ ఏడాది జూన్‌లో అమ్మాయి ఒంటరిగా ఉన్నపుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రేమించాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో బలవంతంగా ఆమె మెడతో తాళి కట్టాడు.

ఇక నుంచి నువ్వు నా భార్యవంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసి అత్యాచారం చేశాడు. ఈ ఘటనతో విద్యార్థిని భయాందోళనకు గురైరంది. ఇంట్లో ఉన్నపుడు తాళి దాచిపెట్టుకుంది. అయితే.. ఇటీవల దసరా సెలవులు ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చింది. అయినా హేమంత్ ఆమెను వదలలేదు. ఆమెపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక అతని వేధింపులను తట్టుకోలేక బాధితురాలు తన తల్లికి పూర్తి విషయాన్ని వెల్లడించింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనంతపురం దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..