Vijayawada: భద్రం బ్రదరూ.! విజయవాడలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. దొరికారంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

వాహనదారులకు విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు బిగ్ అలెర్ట్ ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో బెజవాడలో శనివారం నుంచి ట్రాఫిక్‌ కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త రూల్స్‌ పాటించని వాహనదారులపై భారీ జరిమానాలతో కొరఢా ఝుళిపించబోతున్నారు. ఇంతకీ.. విజయవాడ ట్రాఫిక్ పోలీసులు అమలు చేయబోతున్న కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ఏంటి?... రూల్స్‌ పాటించని వాహనదారులకు ఫైన్‌లు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయి?

Vijayawada: భద్రం బ్రదరూ.! విజయవాడలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. దొరికారంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

Updated on: Mar 02, 2025 | 7:00 AM

ఇప్పటికే గత కొన్ని నెలలుగా విజయవాడలో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మూడు నెలలుగా విజయవాడలో నో హెల్మెల్‌.. నో ఎంట్రీ రూల్‌ అమలు చేస్తున్నారు. ఆ రూల్స్‌తో పాటు మరికొన్ని ఆంక్షలు అమల్లోకి తెచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు.. ఏపీ హైకోర్టు ఆదేశాలతో శనివారం నుంచి వాటిని మరింత స్ట్రిక్ట్‌గా ఫాలో కాబోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలోని 12 రకాల కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ రూల్స్‌ను వాహనదారులు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నట్లు కొత్త సర్క్యులర్‌ జారీ చేశారు. దానిలో భాగంగా ఏయే రూల్స్‌కు ఎంతెంత ఫైన్స్ విధించబోతున్నారంటే..?

  • హెల్మెట్ ధరించకుంటే 1000 రూపాయల జరిమానా
  • బైక్ వెనక కూర్చున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించకుంటే 1000 రూపాయల ఫైన్‌
  • ఇన్సూరెన్స్ లేకుంటే 2వేలు నుంచి 4వేల రూపాయల జరిమానా
  • డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఏకంగా 5వేలు జరిమానా
  • పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే 1500 రూపాయల ఫైన్‌
  • సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే 1500 నుంచి 10వేలు వరకు జరిమానా
  • ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుంటే 150 నుంచి 300 వరకు ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది.
  • కారు డ్రైవర్‌తోపాటు.. ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకుంటే ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా వేస్తారు.
  • రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుంటే 2వేలు నుంచి 5వేల వరకు ఫైన్‌ వసూలు చేస్తారు.
  • అతివేగంతో వాహనం నడిపినా.. బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేసినా 1000 రూపాయల చొప్పున జరిమానా ఉంటుంది.

ఇవి మాత్రమే కాదు.. కారు లేదా బైక్ రేసింగ్‌లకు పాల్పడితే 5 వేల నుంచి 10 వేల వరకు ఫైన్‌ కట్టాల్సి ఉంటుందని విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. వీటిలోని ఏ ఒక్క ట్రాఫిక్ రూల్ వాహనదారులు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి