Cyclone Michaung: అల్లకల్లోలమైన అంబేద్కర్ కోనసీమ.. ముంచేసిన మిచౌంగ్ తుఫాను

| Edited By: Srikar T

Dec 05, 2023 | 5:46 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో మండల ఓడరేవు సముద్రం వద్ద 10 అడుగుల మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. బాపట్ల వద్ద తీరం తాకిన నేపధ్యంలో సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతం అలల ఉధృతి అధికమవడంతో ఆ ప్రాంతం మొత్తం అలకల్లోలంగా మారింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తే ఎలా ఉంటుందో తెలుసా.. సముద్ర తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా..?

Cyclone Michaung: అల్లకల్లోలమైన అంబేద్కర్ కోనసీమ.. ముంచేసిన మిచౌంగ్ తుఫాను
Impact Of Cyclone Michoung Is Severe In Konaseema District Of Andhra Pradesh
Follow us on

తుఫాన్ ప్రభావం నష్టంపై కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పని చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు దెబ్బతిన్నాయన్నారు. మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే రెండు రోజులు విద్యా సంస్థలకు శెలవు ప్రకటించాము. రేపు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నాం అన్నారు. విద్యార్థులు ఎవరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పంట నష్టం వాటిల్లిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని.. తగిన నష్ట పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. 1,50,000 ఎకరాల్లో రైతులు పంట పండిస్తే 15,000 ఎకరాల ధాన్యం ఇప్పటికే మిల్స్ కి తరలించారని వెల్లడించారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదు.. తడిసిన ధాన్యాన్ని బోయిలర్స్ మిల్స్ కి పంపడం జరుగుతుందని తెలిపారు. మత్స్యకారుల వేట నిషేధానికి సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో మండల ఓడరేవు సముద్రం వద్ద 10 అడుగుల మేర సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. బాపట్ల వద్ద తీరం తాకిన నేపధ్యంలో సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతం అలల ఉధృతి అధికమవడంతో ఆ ప్రాంతం మొత్తం అలకల్లోలంగా మారింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తే ఎలా ఉంటుందో తెలుసా.. సముద్ర తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా..? తుపాను ప్రభావంతో మంగినిపూడి బీచ్ దగ్గర దాదాపుగా అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మెరైన్ పోలీసులతో పాటూ స్థానిక పోలీసులు సంయుక్తంగా స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసుకుని, రిలీఫ్ ఆపరేషన్స్ షురూ చేశారు. చేపల వేటకు వెళ్లకుండా మత్య్సకారులను అప్రమత్తం చేస్తున్నారు.

తుఫాన్ వీడియో..

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..