AP Rains: వానలే వానలు.! ఏపీకి తుఫాన్ గండం.. ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌కి తుపాను ముప్పు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలబడి తుపానుగా మారే ఛాన్స్.. మూడ్రోజుల ఏపీలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, కడప, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.. ఐతే బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి మరింత విస్తరించింది. అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల హెచ్చరికతో చిత్తూరు.. తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
మరోవైపు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాంజావూర్, తిరునారూర్, తిరుకొటై జిల్లాల్లో కుండపోత వాన పడటంతో రహదార్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తేని జిల్లాలో జలపాతాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. వచ్చే 48గంటల నుంచి తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరుకు ఆరెంజ్ అలర్ట్.. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..