Andhra Pradesh: ఏపీలో కొనసాగుతోన్న లాటరీ ప్రక్రియ.. 3396 మద్యం దుకాణాలకు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. మద్యం దుకాణాలకు అధికారులు లాటరీ తీస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో లాటరీలు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మొత్తం మూడు టోకెన్లను తీస్తున్నారు అధికారులు...
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. మద్యం దుకాణాలకు అధికారులు లాటరీ తీస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో లాటరీలు తీసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మొత్తం మూడు టోకెన్లను తీస్తున్నారు అధికారులు. తొలి టోకెన్ కే మద్యం షాపును కేటాయిస్తారు.
అయితే ప్రాసెస్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే.. రిజర్వ్‌లో ఉంచిన రెండో టోకెన్‌కు షాపు కేటాయిస్తారు. అది కూడా కుదరకపోతే మూడో నెంబర్‌కు షాపు దక్కుతుంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియలో పాల్గొంటున్న వారు అన్నిరకాల డాక్యుమెంట్లతో సిద్ధపడే వస్తున్నారు. అయితే మహిళలు కూడా షాపులు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. దుకాణాలకు అప్లికేషన్లు వేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.
కాగా రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాల్ని నోటిఫై చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51-52 దరఖాస్తులు వచ్చాయి.
మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..