ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి జాబితాగా 126 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అభ్యర్థిగా భూమా అఖిలప్రియను ప్రకటించిన చంద్రబాబు.. నంద్యాల టికెట్ విషయం మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో భూమా బ్రహ్మానందరెడ్డి దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో భేటీ అయి.. మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన చంద్రబాబు తనకు ఇప్పటికే హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇక ఒకవేళ తనకు నంద్యాల టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని హెచ్చరించారు. కాగా, నంద్యాల టికెట్ కోసం ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి తన అల్లుడికి ఇవ్వాలని చంద్రబాబు ను గట్టిగా కోరుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.