Nandamuri Balakrishna: సీఎం జగన్‌ను కలుస్తా.. మరోసారి ఎమ్మెల్యే బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

|

Feb 05, 2022 | 1:36 PM

MLA Nandamuri Balakrishna on CM YS Jagan: అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా

Nandamuri Balakrishna: సీఎం జగన్‌ను కలుస్తా.. మరోసారి ఎమ్మెల్యే బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Nandamuri Balakrishna
Follow us on

MLA Nandamuri Balakrishna on CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికి.. పోరాటాన్ని విస్తృతం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ శుక్రవారం హిందూపురం (Hindupur) లో మౌనదీక్ష సైతం చేపట్టారు. దీనిలో భాగంగా అఖిలక్ష నేతలతో కలిసి ఉద్యమ కార్యచరణను సైతం ప్రకటించారు. శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి.. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేసేంతవరకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. అందుకోసం అవసరమైతే సీఎం జగన్‌ (CM YS Jagan)ను కలుస్తానంటూ పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే.. జిల్లాల వివాదాన్ని తీసుకొచ్చారంటూ విమర్శించారు. ఒక చిన్న మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్యసాయి జిల్లాకు తాము వ్యతిరేకం కాదని.. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు మీద ప్రేమతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయలేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బాలకృష్ణ పేర్కొ్న్నారు. అంత ప్రేమ ఉంటే అన్నా కాంటీన్లను ఎందుకు తొలగిస్తారంటూ ప్రశ్నించారు. సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని సినీ పెద్దలకు తెలియజేశానని తెలిపారు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం వివాదం సృష్టిస్తోందంటూ మండిపడ్డారు. రాజీనామా చేస్తే.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ విసిరిన సవాలుకు బాలకృష్ణ ఓకే చెప్పారు. హిందూపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి కలసి పని చేస్తామంటూ పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా తన పోరాటాన్ని కొనసాగిస్తానంటూ బాలయ్య స్పష్టంచేశారు.

Also Read:

Andhra Pradesh: కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం.. మంత్రి బాలినేని విమర్శలు..

MLA Balakrishna: హిందూపురం జిల్లా కేంద్రంపై కొనసాగుతోన్న ఆందోళన.. నేడు కలెక్టర్‌ను కలవనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ..