Pandugappa Fish: మత్స్యకారుల వలకు చిక్కిన పండుగప్ప.. చేపల రారాజుని భారీ ధరకు విక్రయం..

గౌతమి గోదావరిలో మత్యకారుల కు దొరికిన పండుగప్ప చేపను ఏషియన్ సీ బాస్ అని పిలుస్తారు. మార్కెట్‌లో ఈ పండుగప్పకు మంచి విలువ ఉంటుంది. పండుగప్పను పులుసు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా తింటారని స్థానికులు చెబుతున్నారు. ఈ అరుదైన చేపలు చిక్కితే మత్స్యకారుల సంతోషం అంతా ఇంతా కాదు. అరుదైన చేపను దక్కించు కునేందుకు మాంసం ప్రియులు యానాం మార్కెట్ లో ఎగబడ్డారు. 

Pandugappa Fish: మత్స్యకారుల వలకు చిక్కిన పండుగప్ప.. చేపల రారాజుని భారీ ధరకు విక్రయం..
Pandugappa Fish
Follow us

| Edited By: Surya Kala

Updated on: Oct 16, 2023 | 10:55 AM

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం లో 20 కిలోల భారీ పండుగప్ప స్ధానిక మత్యకారుల కు చిక్కింది. భారీ పండుగప్ప యానాం ఇందిరాగాంధీ మార్కెట్ కు విక్రయానికి వచ్చింది. దీనిని స్థానిక మత్యకారులు పోనమండ భద్రం, రత్నం దంపతులు 12,000 వేలకు విక్రయించారు. ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకడం చాలా అరుదని మత్యకారులు తెలిపారు. గౌతమి గోదావరిలో మత్యకారుల కు దొరికిన పండుగప్ప చేపను ఏషియన్ సీ బాస్ అని పిలుస్తారు. మార్కెట్‌లో ఈ పండుగప్పకు మంచి విలువ ఉంటుంది.

పండుగప్పను పులుసు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా తింటారని స్థానికులు చెబుతున్నారు. ఈ అరుదైన చేపలు చిక్కితే మత్స్యకారుల సంతోషం అంతా ఇంతా కాదు. అరుదైన చేపను దక్కించుకునేందుకు మాంసం ప్రియులు యానాం మార్కెట్ లో ఎగబడ్డారు.

పండుగప్ప ప్రత్యేకత

చేపలలో రారాజు పండుగొప్ప. సముద్రం, ఉప్పు నీటిలో దొరికే ఈ చేప్పలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సీ ఫుడ్ లవర్స్ పండుగప్ప చేపకు ను తినేందుకు నాన్ వెజ్ ప్రియులు ఎగబడతారు. అంతేకాదు అంతర జాతీయ మార్కెట్ లో పండుగప్ప చేపలకు మంచి ధర ఉంది. అయితే పండుగప్ప బతుకున్న చేపలను మాత్రమే ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..