Yanam: గోదావరిలో వలకు చిక్కిన భారీ పండుగప్ప.. రేటు ఎంత పలికిందో తెల్సా..?

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భారీ పండుగప్ప మత్సకారులకు భారీ సైజ్ ఉన్న పండుగప్ప చిక్కింది. యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌‌లో ఈ చేపను వేలం వేయగా భారీ రేటు దక్కింది.

Yanam: గోదావరిలో వలకు చిక్కిన భారీ పండుగప్ప.. రేటు ఎంత పలికిందో తెల్సా..?
Pandugappa Fish

Edited By: Ram Naramaneni

Updated on: Jul 03, 2023 | 7:59 AM

సముద్రపు చేపల రుచులో రారాజుగా పిలిచే భారీ పండుగప్ప యానాం గౌతమి గోదావరిలో మత్యకారుల వలకు చిక్కింది. 15 కేజీల పండుగప్ప చేపను స్థానిక మార్కెట్ వేలం పాటలో మత్యకార దంపతులు పోనమండ భద్రం,రత్నంలు 9 వేల రూపాయలకు దక్కించుకున్నారు. గోదావరిలో ఇంత భారీ పండుగప్ప చేప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని మత్యకారులు తెలిపారు. గోదావరిలో దొరికే పండుగప్ప చేప మంచి రుచిగా ఉండటంతో మాంస ప్రియులు దీనిని కొనడానికి పోటీ పడ్డారు.

గతంలో 20 కేజీ ల పండుగప్ప దొరకగా ఇప్పుడు 15 కేజీ ల పండుగప్ప దొరకడంతో మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాలలో పులస పులుసు తరహాలో పండుగప్ప చేప కూర, వేపుడు ముక్కల వంటకాన్ని మాంసప్రియులు ఇష్టంగా తింటారు.  సముద్రపు ఉప్పు నీటితో పాటు మంచి నీటి నదులలో పెరగడం పండుగప్ప ప్రత్యేకత.  పండుగప్ప మాంసాహారం మాత్రమే తింటుందట. ఈ చేపను తింటే శరీరానికి కవాల్సిన చాలా ప్రొటీన్లు అందుతాయట.  పులుపు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా దీన్ని తింటారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఇంట్రస్ట్ చూపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..