Watch Video: కుక్క విశ్వాసం అంటే ఇదే.. రాత్రంతా పామును ఇంట్లోకి రానివ్వకుండా భీకరపోరు..

విజయనగరం జిల్లాలో పాము, కుక్కల మధ్య చోటుచేసుకున్న ఘటన ఆసక్తిగా మారింది. ఇంట్లోకి రావడానికి ప్రయత్నించిన పాము, ఆ పామును అడ్డుకోవడానికి యత్నించిన కుక్క మధ్య జరిగిన ఘర్షణ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ పాము, కుక్కల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

Watch Video: కుక్క విశ్వాసం అంటే ఇదే.. రాత్రంతా పామును ఇంట్లోకి రానివ్వకుండా భీకరపోరు..
Snake And Dog Figtht

Edited By:

Updated on: Mar 02, 2024 | 9:26 PM

విజయనగరం జిల్లాలో పాము, కుక్కల మధ్య చోటుచేసుకున్న ఘటన ఆసక్తిగా మారింది. ఇంట్లోకి రావడానికి ప్రయత్నించిన పాము, ఆ పామును అడ్డుకోవడానికి యత్నించిన కుక్క మధ్య జరిగిన ఘర్షణ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ పాము, కుక్కల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. సురేష్ అనే వ్యక్తి బ్రూనో అనే ఓ కుక్కను గత నాలుగేళ్లుగా అతి గారాబంగా పెంచుతున్నాడు. ఆ కుక్కను తన పిల్లల సమానంగా చూసుకుంటారు కుటుంబసభ్యులు. అయితే సురేష్ కుటుంబసభ్యులు ఎప్పటిలాగే బ్రూనోను వరండాలో వదిలేసి రాత్రి పదిగంటలకు ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. బ్రూనో బయట వరండాలో పహారా కాస్తుంది. అలా పహారా కాస్తుండగా అర్ధరాత్రి సమయంలోనే ఆరడుగుల పెద్ద నాగుపాము ఇంటి గేటులో నుండి శరవేగంగా దూసుకువచ్చింది. అది గమనించిన కుక్క వెంటనే చాకచక్యంగా పామును పట్టుకొని ఇంటి నుండి బయటకు విసిరేసింది. అలా విసిరే క్రమంలో పాము కూడా ప్రతిఘటించింది. ఎట్టకేలకు పామును బయటకు విసిరిన తరువాత మరోసారి పాము ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేసింది. అయితే కుక్క పామును ఏ మాత్రం లోపలికి రానీయకుండా అడ్డుపడింది. పాము లోపలకి రావడానికి యత్నించడం, కుక్క అడ్డుకోవడం రెండింటి మధ్య ఘర్షణ సుమారు రెండు గంటల పాటు సాగింది.

ఆ తరువాత కొంతసేపటికి కుక్క అరుపుల విన్న కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. కుక్క ఎందుకు అరుస్తుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. అంతా చిమ్మచీకటిగా ఉండటంతో అసలు ఏమి జరిగిందో? ఎందుకు అరుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. తరువాత టార్చ్ లైట్ వేసి కొంతసేపు వెదకగా నాగుపాము పడగ విప్పి ఇంటి గేటు వద్ద కనిపించింది. అప్పటికే సుమారు రెండు గంటల నుండి పాము ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ తరువాత కుటుంబసభ్యులు పామును అక్కడ నుండి పంపటానికి పెద్దపెద్ద కేకలు వేసినప్పటికీ పాము ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పడగవిప్పి బుసలు కొడుతూనే ఉంది. బుసలు కొడుతున్న పాము ఒకవైపు, ఆ పామును చూసి అరుస్తున్న కుక్కను మరోవైపు. ఈ రెండింటినీ చూసిన కుటుంబసభ్యులు ఆందోళనతో కేకలు వేశారు. వారి కేకలు విన్న చుట్టుప్రక్కల జనం పామును అక్కడ నుండి పంపేందుకు చాలా అవస్థలు పడ్డారు. చివరికి స్నేక్ క్యాచర్ రంగప్రవేశం చేసి పామును అక్కడ నుండి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పామును ఇంట్లోకి రానీయకుండా సుమారు మూడు గంటల పాటు ప్రయత్నించి విశ్వాసం చాటుకున్న బ్రూనోను చూసి ఆనందంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..