AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR District: ఈ చిత్రం చూశారా..? గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ గుర్రం..

గంజాయి కేసులో గుర్రం అరెస్టయింది. ఇప్పుడు అది పోలీస్ స్టేషన్‌లో ఉంది. దానికి దాణా, గడ్డి పెడుతున్నారు పోలీసులు. దాన్ని వదిలేదే లేదని చెబుతున్నారు. ఇంతకీ అసలు కేసు ఏంటి..? ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి...

NTR District: ఈ చిత్రం చూశారా..? గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ గుర్రం..
Horse At Police Station
Ram Naramaneni
|

Updated on: May 05, 2025 | 2:07 PM

Share

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో విచిత్ర కేసు వెలుగుచూసింది. గంజాయి అమ్ముతూ పోలీసులకు గుర్రం పట్టబడింది. గుర్రాన్ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు పోలీసులు.  గుర్రమేమిటి గంజాయి అమ్మడం ఏంటి అనుకుంటున్నారా…! అవును నిజమేనండి బాబు.. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పోలీసులు గంజాయి అమ్మేందుకు సహకరిస్తుందని గుర్రాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇఫ్పుడు దానికి రోజూ దాణా, గడ్డి తెచ్చిపెడుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో ఒక చోట కొందరు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అంతే పోలీసులను చూసి అక్కడున్నవారంతా పరారయ్యారు.  ఐతే అక్కడే ఉన్న గుర్రం మాత్రం దొరికింది.  గుర్రమైతే మాకేంటి ఇది కూడా గంజాయి తాగుతున్న వారితో స్నేహం చేసింది. వారికి సహకరించిందని గుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం వత్సవాయి పోలీస్ స్టేషన్ లో ఈ గుర్రాన్ని కట్టేసి సకల మర్యాదలు చేస్తున్నారు. గుర్రంపై స్వారీ చేస్తూ గంజాయి రవాణా చేస్తున్నారన్నది దానిపై అభియోగం.

గుర్రం యజమానికి గంజాయి అమ్మకాలపై సంబంధం ఉన్నదా..? గంజాయి రవాణా చెయ్యడానికి పోలీసులకు అనుమానం రాకుండా గుర్రాన్ని వాడుతున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్ానరు.  మొత్తానికి గంజాయి అమ్మకంలో సహకరిస్తుందని అశ్వాన్ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..