Tirupati by elections: తిరుపతిలో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు నాటకాలు.. తిరుపతి ఘటనపై హోంమంత్రి సుచరిత రియాక్షన్
Tirupati by elections: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లు విసిరిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి సుచరిత స్పందించారు. గుంటూరులో..
Tirupati by elections: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లు విసిరిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి సుచరిత స్పందించారు. గుంటూరులో ఇవాళ మీడియాతో మాట్లాడిన సుచరిత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాళ్ల దాడి జరిగిందనేది అవాస్తం అని అన్నారు. తిరుపతి ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందుతుందని, అది గ్రహించే చంద్రబాబు కొత్త నాటకానికి తెర లేపారని సుచరిత విమర్శించారు. రాళ్ల దాడి పేరుతో తిరుపతి ఎన్నికల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు తీరుపై సుచరిత విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు రాళ్లతో దాడి చేయవలసిన అవసరం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారని హోంమంత్రి సుచరిత ధీమా వ్యక్తం చేశారు.
కాగా, వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై వస్తున్న విమర్శలపైనా హోంమంత్రి సుచరిత ఈ సందర్భంగా స్పందించారు. వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ పరిధిలో ఉందని, సీబీఐ అధికారులు ఈ కేసులు విచారిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసును తేల్చాల్సింది సీబీఐ నే అని ఉద్ఘాటించారు. బీజేపీ-జనసేను ఆ పని చేస్తే బాగుంటుందన్నారు. ఈ కేసులు త్వరితగతిన పూర్తి కావాలని తాము కూడా భావిస్తున్నామని సుచరిత పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార సమయంలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కాగా, రాయి విసిరిన ఘటనను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు.. రోడ్డుపైనే బైఠాయించారు. రౌడీల పాలనలో ఇలాంటి ఘటనలే జరుగుతాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, చంద్రబాబు విమర్శలను వైసీపీ నేతలు అంతే స్థాయిలో ఖండిస్తున్నారు. చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హోంమంత్రి సుచరిత కౌంటర్ ఇచ్చారు.
Also read:
Ugadi 2021: సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్
CBSE Exams 2021: బోర్డు పరీక్షలు రద్దు చేయండి.. లేకపోతే కరోనా ప్రళయమే: సీఎం కేజ్రీవాల్