Kuppam High Tension: కుప్పంలో కొనసాగుతోన్న హైటెన్షన్‌.. టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణలపై 13 కేసుల నమోదు..

|

Aug 27, 2022 | 8:21 AM

టీడీపీ, వైసీపీ ఫైట్‌లపై వరుస కేసులు నమోదవుతున్నాయి. రామకుప్పంలో ఐదు, కుప్పంలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్ అయ్యాయి. YCP నేతలిచ్చిన కంప్లైంట్‌తో 59మంది టీడీపీ కేడర్‌పై 6 కేసులు ఫైల్‌ చేశారు.

Kuppam High Tension: కుప్పంలో కొనసాగుతోన్న హైటెన్షన్‌.. టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణలపై 13 కేసుల నమోదు..
Chandrababu Naidu
Follow us on

Kuppam Politics: కుప్పం కుతకుత ఉడుకుతోంది. మూడోరోజు కూడా ఉద్రిక్తతల మధ్యే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టూర్‌ సాగింది. ఒకవైపు కేసులు, మరోవైపు డైలాగ్ వార్‌తో కుప్పం హీటెక్కిపోయింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులుగా హైటెన్షన్‌ కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ ఫైట్‌లపై వరుస కేసులు నమోదవుతున్నాయి. రామకుప్పంలో ఐదు, కుప్పంలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్ అయ్యాయి. YCP నేతలిచ్చిన కంప్లైంట్‌తో 59మంది టీడీపీ కేడర్‌పై 6 కేసులు ఫైల్‌ చేశారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ముగ్గురు మెయిన్‌ లీడర్స్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. 307, 353, 332, 143, 147, 148, 506, 436 ఐపీసీ సెక్షన్లతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను ఈ కేసుల్లో పెట్టారు. కేసులపై సీరియస్‌ అయ్యారు చంద్రబాబు. మీరే దాడులు చేస్తారు? మళ్లీ మీరే కేసులు పెడతారా? ఇదేం అరాచకమంటూ చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. వైఎస్ఆర్‌సీపీ పతనం ఖాయమంటూ పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.

వైసీపీ కార్యకర్తలు, వాళ్ల ఇళ్లపై పార్టీ జెండాలు కట్టుకుంటే బాబుకేంటి బాధ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలో లోకేష్‌ జెండా పీకేశారు, కుప్పంలో బాబు జెండా కూడా పీకేయడం ఖాయమంటూ విమర్శలు గుప్పించారు.

మరోవైపు, ఉద్రిక్తతల మధ్యే మూడోరోజు కూడా బాబు టూర్‌ కొనసాగింది. వైసీపీ అక్రమ కేసులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్న ఆయన, ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..