Amalapuram Traffic News: ఏపీ తూర్పుగోదావరి (East Godavari) జిల్లా అమలాపురంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడా.. అక్కడా అన్న తేడా లేకుండా పట్టణం నలుమూలలా వందల సంఖ్యలో నిలిచిపోయాయి వాహనాలు. కొన్ని చోట్ల కిలోమీటర్లమేర ఆగిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ (traffic jam) తో వాహనదారులతోపాటు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రేపు శుభముహూర్తం ఉండడంతో భారీ సంఖ్యలో పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లిళ్లతో పాటు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం ఉండడంతో విపరీతంగా పెరిగింది ట్రాఫిక్. అమలాపురంలోని గడియార స్తంభం, ఈదరపల్లి వంతెన, నల్లవంతెన, ఎర్రవంతెన దగ్గర కిలోమీటర్లమేర బారులుతీరాయి వాహనాలు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా రేపు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమలాపురం ఇప్పటికే భక్తులతో నిండిపోయింది. భక్తుల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించగా భారీగా హాజరయ్యారు భక్తులు. రేపు స్వామివారి కల్యాణం కావడంతో ఇప్పటి నుంచే భక్తుల రాక ప్రారంభమవడంతో రహదారులు రద్దీగా మారాయి.
స్వామివారి కల్యాణ షెడ్యూల్ చాలా రోజుల క్రితమే విడుదల చేయడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారి కల్యాణానికి తోడు శుభముహూర్తం ఉండడంతో భారీ సంఖ్యలో పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి సామగ్రి కొనుగోళ్లకు వచ్చే వారితో అమలాపురం రహదారులు నిండిపోయాయి. దుకాణాలన్నీ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా వస్త్రదుకాణాలు మరింత రద్దీగా మారాయి.
Also Read: