– వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తిరాలకు అనుకొని బంగాళాఖాతంలో కేంద్రీకృతమైఉంది. దీనికి తోడు అల్పపీడనం ఉన్న ప్రాంతంలోనే 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోని కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా రుతుపవన ద్రోణీ బలపడింది.
– అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీకి భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఈరోజు కోస్తా రాయలసీమలో మోస్తారు నుంచి విస్తారంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు.. నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాయలసీమలోని నంద్యాల, వైయస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అలాగే.. ఈరోజు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
– కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఇస్తాయని అంచనా వేసింది. నాలుగు రోజులపాటు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంమరికొన్నిచోట్ల ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే ఆస్కారం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..