వేసవి తాపం నుంచి ఉపశమనం ఇస్తూ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు ఇక్కట్లు పడ్డారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో అర్ధగంట పాటు ఆగకుండా వర్షం దంచికొట్టింది. కుంభ వర్షం కురిసింది. శ్రీశైలం, సున్నిపెంటలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.ఈ వర్షం ధాటికి క్షేత్రంలో అలానే సుండిపెంటలో ప్రధాన వీధులన్ని జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా శ్రీ మల్లన్న స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు.
ఎండ ఉక్కపోతకు గురైన స్థానికులు భక్తులు భారీ వర్షం పడటంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలితో వర్షం మొదలవడంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు శ్రీశైలం క్షేత్రంలో విద్యుత్తిని నిలిపివేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..