కృష్ణాజిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలకు పలుచోట్ల చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి. పట్టణానికి మంచినీటిని అందించే చెరువుకు గండి పడడంతో స్థానికులు ఆందోళకు గురయ్యారు. వందల క్యూసెక్కుల నీరు కట్టను దాటి బయటకు రావడంతో పక్కనే ఉన్న కాలనీలు ముంపు బారీన పడ్డాయి. గుడివాడలోని పప్పుల చెరువుకు గండి పడింది. దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది. గుడివాడ మునిసిపాలిటీ కి ఇదే మంచినీటి చెరువు కావటంతో తాగునీటి సరఫరా పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
పైగా, ఈ చెరువు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చెరువు పరిసరాల్లోని పంట పొలాల్లోకి తాగునీరంతా వృధాగా పోయింది. మందపాడు, ఆదర్శ్‌నగర్ కాలనీల్లోకి భారీగా నీరు రావడంతో స్దానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే చెరువుకు గండి పడిన విషయమై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువు కట్ట బలహీనపడి, గండిపడిందని చెబుతున్నారు.
Also Read: Samantha: సమంతకు మరో క్రేజీ ఆఫర్.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాటల మాంత్రికుడు.?
Vijay Devarakonda: తన మద్దతు చిరుకే అంటోన్న విజయ్ దేవరకొండ.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్..