Rain Alert: వదల బొమ్మాళీ.. వదల! వచ్చే 3 రోజులు కుండబోతే.. వారికి హెచ్చరికలు

|

Jul 24, 2024 | 9:25 AM

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడ్రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడింది.

Rain Alert: వదల బొమ్మాళీ.. వదల! వచ్చే 3 రోజులు కుండబోతే.. వారికి హెచ్చరికలు
Ap Rains
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడ్రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో పలుచోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

తెలంగాణలో రెండురోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. హైదరాబాద్‌లో అయితే ప్రస్తుతం వాతావరణం కూల్‌గా ఉంది. మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

 

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..