AP Weather: రైతులకు ఊరట..ఏపీకి వర్షసూచన చేసిన వాతావరణ శాఖ
ఆగస్టు 29 నాటికి తూర్పు-మధ్య... దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సూచన నివేదికలు సూచిస్తున్నాయి, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఆగస్టు 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తూర్పు మధ్య బంగాళాఖాతం & పొరుగున ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. దీని ప్రభావంతో తూర్పు మధ్య & ఆనుకుని ఉన్న ఉత్తర ఖాతంలో 29 ఆగస్టు, 2024 తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈ అల్పపీడనం తదుపరి 2 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా & ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరా తీరప్రాంతాలకు చేరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
శుక్రవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
————————————–
బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
శుక్రవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
రాయలసీమ :-
————————————————
బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
శుక్రవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..