Badvel Election: కడప జిల్లా బద్వేల్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ఎఫెక్ట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పడింది. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్దకు పీవోలు, ఏపీవోలు, పీపీవోలు చేరుకున్నారు. అయితే, సామాగ్రి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తం అవగా.. వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కురుస్తుండటంతో ఎలక్షన్ సామాగ్రిని పంపిణీ చేయలేని పరిస్థితి ఉంది. షామియానాలు పూర్తిగా తడిసిపోయాయి. మరోవైపు వర్షం కారణంగా సామాగ్రి పంపిణీ కేంద్రంలోకి సిబ్బంది రాలేకపోతున్నారు. కాగా, బద్వేల్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ ఉండగా.. పోలింగ్ సిబ్బందికి వెయ్యి గొడుగులు, ఏడు వేల రేయిన్ కోట్ల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Also read:
Food Adulteration: మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా?..ఇలా గుర్తించండి..
Crime News: హైదరాబాద్‌లో కలకలం.. కేబీఆర్ పార్క్‌లో గుర్తు తెలియని మృతదేహం..
చాణక్యనీతి: ఒక వ్యక్తిని కాల్చడానికి అగ్ని అవసరం లేదు.. ఈ 5 విషయాలు చాలంటున్న ఆచార్య చాణక్య..