
Heatwave in Andhra Pradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మరోవైపు వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ శనివారం తెలిపారు. రేపు 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 73 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 227 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న జిల్లాల మండలాలు(109) :
అల్లూరి 9, అనకాపల్లి 6, బాపట్ల 8, తూర్పుగోదావరి 17, ఏలూరు12, గుంటూరు 9, కాకినాడ 18, కోనసీమ 7, కృష్ణా 15, మన్యం 5, పశ్చిమగోదావరలో 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
45 డిగ్రీలకు పైగానే..
శనివారం విజయనగరం జిల్లా కనిమెరకలో 45.1°C, మన్యం జిల్లా పాచిపెంటలో 44.9°C, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44.7°C, నెల్లూరు జిల్లా కొండాపురంలో 44.5°C, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 44.3°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, కృష్ణా జిల్లా నందివాడ, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.1°C, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 188 మండలాల్లో తీవ్రవడగాల్పులు,176 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే బెటర్ అని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడొచ్చని హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..