AP Latest Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఓ వైపు వానలు.. మరోవైపు ఠారెత్తించే ఎండలు

|

Apr 16, 2023 | 12:37 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠాకెత్తిస్తున్నాయి. వడగాడ్పులు తోడవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. కోస్తా రాయలసీమలో ఎండ తీవ్రతకు పశువులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని..

AP Latest Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఓ వైపు వానలు.. మరోవైపు ఠారెత్తించే ఎండలు
Weather Report
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠాకెత్తిస్తున్నాయి. వడగాడ్పులు తోడవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. కోస్తా రాయలసీమలో ఎండ తీవ్రతకు పశువులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎండల్లో పిల్లలు, గర్భిణిలు, వయోవృద్ధులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటుగా ఉధృతంగా వీస్తున్న వడగాల్పులతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోంది.

ఏపీలోని కోస్తా జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరంలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌ 18 వరకు ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెల్పింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో 30-40 కి.మీల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెల్పింది. పలుచోట్ల వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.