AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకలి అమ్మకే అర్థమవుతుంది.. జాతి వైరాన్ని పక్కన పెట్టి పందిపిల్లకు పాలిచ్చిన గోమాత!

సాధారణంగా ఆవులు ఇతర జంతువుల పిల్లలు దగ్గరికి వస్తే కాలితో తంతాయి. వాటిని ధరిచేర నివ్వవు కానీ, ఇక్కడ జరిగిన సంఘటన చూసిన తర్వాత తల్లి ప్రేమ ముందు ఎంతటి వైరమైనా దిగదుడుపే అనిపిస్తుంది. ఆకలితో ఉన్న ఓ పంది పిల్ల, రోడ్డుపై సేదతీరుతున్న ఆవు దగ్గరికి వచ్చి పాలు తాగడం మొదలుపెట్టింది. ఆ విషయాన్ని గమనించినప్పటికీ ఆ ఆవు దానిని ఏమీ అనకుండా ఆకలి తీర్చింది. 'తల్లి ఎవరికైనా తల్లే' అని, ఆకలి తీర్చే విషయంలో ఈ లోకంలో అమ్మ ప్రేమకు సాటి ఏదీ లేదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ఆకలి అమ్మకే అర్థమవుతుంది.. జాతి వైరాన్ని పక్కన పెట్టి పందిపిల్లకు పాలిచ్చిన గోమాత!
Cow Feeding Piglet
Anand T
|

Updated on: Aug 26, 2026 | 4:38 PM

Share

కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక అపురూప ఘటన స్థానికులను, దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఆవుల మంద సేద తీరుతోంది. అదే సమయంలో, మందలోని ఒక గోమాత చెంతకు ఒక చిన్న పందిపిల్ల చేరుకుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆ పందిపిల్ల గోమాత పాలు తాగడం మొదలుపెట్టింది.

సాధారణంగా వివిధ జాతుల జంతువులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు దూరం పాటించడం లేదా పోరాడటం చూస్తాం. కానీ ఈ సందర్భంలో, ఆ గోమాత ఎటువంటి కోపం లేదా ప్రతిఘటన లేకుండా, ఎంతో ప్రశాంతంగా, ప్రేమగా పందిపిల్లను పాలు తాగనిచ్చింది. పందిపిల్ల ఆవుపాలు తాగుతూ తన ఆకలిని తీర్చుకుంది.

ఈ దృశ్యం అమ్మ ప్రేమకు భాష లేదు, జాతి లేదు అనే సత్యాన్ని చాటిచెప్పింది. మానవ సంబంధాలలో కూడా జాతి, మత భేదాలు తరచుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో, జంతువుల మధ్య కనిపించిన ఈ నిస్వార్థ ప్రేమ బంధం చూసి స్థానికులందరూ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ హృదయపూర్వక సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై, అనేక మంది హృదయాలను హత్తుకుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ప్రభుత్వ యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా..? ఇంటి నుంచే అన్నీ సేవలు
ఈ ప్రభుత్వ యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా..? ఇంటి నుంచే అన్నీ సేవలు
జాతి వైరాన్ని పక్కన పెట్టి పందిపిల్లకు పాలిచ్చిన గోమాత!
జాతి వైరాన్ని పక్కన పెట్టి పందిపిల్లకు పాలిచ్చిన గోమాత!
త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మరో గొప్ప జీవిత పాఠం.. వీడియో
త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మరో గొప్ప జీవిత పాఠం.. వీడియో
రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!
రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
కుండీలలో మల్లె మొక్కకు గుత్తులుగా మల్లెపూలు పూయాలంటే ఇలా చేయండి
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
అతడిలాగా ఒక్క రోజు బతికితే చాలు..
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నారా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
చాణక్య నీతి.. ఈ విషయాల్లో సిగ్గు పడితే నష్టమే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
రక్షాబంధన్.. రాఖీ కట్టే సమయంలో చేయకూడని, చేయాల్సిన పనులివే!
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..
ఓటీటీని ఊపేస్తున్న రొమాంటిక్ మూవీ.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..