Andhra Pradesh: అతను హెడ్ మాస్టారు.. స్టూడెంట్స్ కోసం అన్నీ తానై..! కత్తెర పట్టుకొని…
ఆయన ప్రభుత్వ పాఠశాల ఉద్యోగి. ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెద్ద దిక్కుగా విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తిపరంగా.. అవసరమైన అన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తూనే.. పిల్లల పట్ల మరింత శ్రద్దను పెంచుకున్నాడు. అవసరాన్ని బట్టి పిల్లల కోసం...అందరికీ నడిపించే ప్రధానోపాధ్యాయుడు అక్కడ ప్రత్యేకం. తన వృత్తిరీత్యా బాధ్యతను నిర్వర్తిస్తూనే.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అల్లూరి జిల్లా హుకుంపేట గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల అది. దాదాపుగా 300 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన పిల్లలు.. ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. టీచర్లు, సిబ్బంది కూడా పదిమంది వరకు ఉంటారు. ఎవరి విధుల్లో వాళ్ళు ఉంటారు. కానీ అందరికీ నడిపించే ప్రధానోపాధ్యాయుడు అక్కడ ప్రత్యేకం. తన వృత్తిరీత్యా బాధ్యతను నిర్వర్తిస్తూనే.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
వాళ్ళ కోసం.. కత్తెర పట్టి..
హుకుంపేట గిరిజన బాలుర సంక్షేమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తున్నారు బాలాజీ. ప్రధానోపాధ్యాయుడుగా ఉన్నప్పటికీ.. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. తల్లితండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా.. విద్యార్థులకు చదువు, వసతి సౌకర్యాలు అందేలా చూస్తూనే.. కుటుంబ పెద్దలా బాధ్యతలు తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిలానే కాకుండా.. విద్యార్థులకు అవసరమైన సేవలను తన వంతు చేస్తున్నారు.
క్రమశిక్షణ కోసమే..
చదువుకోవాలంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ కచ్చితంగా ఉండాలని బోధిస్తూనే.. అందుకు తగ్గట్టుగానే విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఆ ప్రధానోపాధ్యాయుడు బాలాజీ. అందుకోసం తానే స్వయంగా రంగంలోకి దిగిపోయారు. విద్యార్థులకు యూనిఫామ్, హెయిర్ స్టైల్ క్రమశిక్షణకు తగ్గట్టుగా ఉండాలని ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. క్షురకుడు రాకపోవడంతో.. విద్యార్థుల్లో చాలా మందికి తల వెంట్రుకలు బాగా పెరిగిపోయాయి. దీంతో తల వెంట్రుకలు పెరిగిపోయి చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి తానే స్వయంగా సేవ చేస్తున్నారు ప్రధానోపాధ్యాయుడు. చేతిలో కత్తెర పట్టుకొని.. విద్యార్థుల సమ్మతితో సందర్భాన్ని బట్టి క్షురకుడులా మారి సేవలు కూడా ప్రధానోపాధ్యాయుడు చేస్తున్నారు. ఖాళీ సమయంలో.. జుత్తు పెరిగిపోయిన వారి.. తల వెంట్రుకలను కత్తెర పట్టుకుని తానే స్వయంగా కత్తిరిస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపుగా 20 మంది పిల్లలకు తానే స్వయంగా ఏర్పాటు చేశారు ఆ ప్రధానోపాధ్యాయుడు బాలాజీ. అందరి పిల్లలతో సమానంగా ఉంటూ క్రమశిక్షణ అలవడేందుకు ఇలా చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడుగా తనవరకు బాధ్యతలు నిర్వహిస్తే సరిపోతుంది. కానీ ఈ ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రం పాఠశాలలోని పిల్లల్ని తన సొంత పిల్లల భావించి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు.. ప్రత్యేకంగా క్రమశిక్షణను అలవాటు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి విద్యార్థుల కోసం ప్రత్యేక సేవ చేస్తున్నారు. విద్యార్థులంతా పాఠశాల్లో క్రమ పద్ధతిలో కనిపించాలని వారిలో క్రమశిక్షణ అలవర్చాలని ఇటు వంటి సేవ చేస్తున్నానని అంటున్నారు ప్రధాన ఉపాధ్యాయుడు బాలాజీ.
నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లో కొంతమంది ఖాళీ సమయం కోసం వేచి చూస్తుంటారు. కానీ ఈ ప్రధానోపాధ్యాయుడు మాత్రం.. ఖాళీ సమయం దొరికితే చాలు పాఠశాలలో పిల్లలను సేవ చేయడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న సేవలకు విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా సలాం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..