తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి సామాజిక వర్గాలకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఓబీసీ జాబితాలోకి ఆయా సామాజిక వర్గాలు వస్తాయని చెప్పారు ఎంపీ జీవీఎల్. తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి సామాజిక వర్గాల వారికి శుభవార్త చెప్పారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. ఈ సామాజిక వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లకై కేంద్ర ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ సిఫారసు చేసిందని తెలిపారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ అహిర్‌ను జీవీఎల్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. బీసీ ఇతర సామాజిక వర్గాల సంక్షేమంపై సమీక్షించేందుకు ఉత్తరాంధ్రలో పర్యటించాలని కోరారు. దీంతో బీసీ ఇతర సామాజిక వర్గాల సంక్షేమ చర్యలను సమీక్షించేందుకు త్వరలో విశాఖ ఎన్‌సీబీసీ చైర్మన్ రానున్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆయా సామాజికవర్గాలకు నష్టం చేకూరిందని చెప్పారు జీవీఎల్. దీని ద్వారా రాష్ట్రంలో 40 లక్షలకు పైగా వున్న తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సొండి సామాజిక వర్గాలకు మేలు చేకురూతుందని తెలిపారు జీవీఎల్. రెండేళ్లుగా కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని జీవీఎల్ పార్లమెంట్‌లో అనేక మార్లు లేవనెత్తారు. జీవీఎల్ గత 12 నెలలుగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, ఎన్‌సీబీసీ వద్దకు ఈ సామాజిక వర్గాలకు చెందిన నేతల ప్రతినిధులను పలుమార్లు తీసుకెళ్లారు. దీంతో రాష్ట్రంలోని తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సొండి, అరవ వర్గాలను ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చాలని ఎన్‌సీబీసీ భారత ప్రభుత్వానికి సిఫార్సు పంపింది. తన విజ్ఞప్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎన్‌సీబీసీ ఛైర్మన్ హన్స్‌రాజ్ అహిర్‌కు జీవీఎల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్‌సీబీసీ సిఫార్స్ వల్ల పైన పేర్కొన్న సామాజిక వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లు దక్కుతాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..