AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడి కంటే లేదు.. మీకైనా బుద్ధి ఉండాలిగా.. నిందితుడికి సహకరించిన అమ్మ, అమ్మమ్మ.. చివరకు..

గుంటూరు రూరల్ మండలంలో నివసించే బాలిక పదో తరగతి చదువుతోంది. గత మే నెలలో బంధవుల ఇంటిలో శుభ కార్యం ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంపించారు. అక్కడ నెల్లూరుకు చెందిన బన్నీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ విద్యార్ధిని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత

వాడి కంటే లేదు.. మీకైనా బుద్ధి ఉండాలిగా.. నిందితుడికి సహకరించిన అమ్మ, అమ్మమ్మ.. చివరకు..
Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 16, 2025 | 12:40 PM

Share

గుంటూరు రూరల్ మండలంలో నివసించే బాలిక పదో తరగతి చదువుతోంది. గత మే నెలలో బంధవుల ఇంటిలో శుభ కార్యం ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పంపించారు. అక్కడ నెల్లూరుకు చెందిన బన్నీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ విద్యార్ధిని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత నుండి తరుచూ ఫోన్ చేసి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆ విద్యార్ధిని చదువుకుంటున్న పాఠశాల వద్దకు స్నేహితుడితో కలిసి వచ్చాడు. ఆ బాలికకు మాయ మాటలు చెప్పి అక్టోబర్ పదో తేదిన తనతో పాటు తీసుకెళ్లాడు. ఐదు రోజుల పాటు తన వద్ద ఉంచుకున్నాడు. అక్టోబర్ 15వ తేదిన ఆ బాలిక మెడలో పసుపు కొమ్ముతో తయారు చేసిన తాళి కట్టాడు. దీంతో భయభ్రాంతులకు గురైన బాలిక ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది.

అయితే బన్నీ అమ్మ, అమ్మమ్మ ఆ బాలికకు నచ్చ జెప్పి పెళ్లైన వెంటనే పుట్టింటికి వెళ్లకూడదని చెప్పారు. ఆ రోజు తమ ఇంటిలోకే బాలికను ఉంచారు. రాత్రి సమయంలో బన్నీ… ఆ బాలికపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు బాలిక గొడవ చేస్తుండటంతో ఆమెను తీసుకొని గుంటూరు రూరల్ మండలంలోని బాలిక స్వగ్రామానికి వచ్చాడు. అయితే అప్పటికే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలించడం మొదలు పెట్టారు.

ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి బన్నీని అరెస్ట్ చేశారు. అయితే అత్యాచారంపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడికి అమ్మ, అమ్మమ్మ, స్నేహితుడు సహకరించినట్లు గుర్తించారు.

బన్నీ అమ్మ, అమ్మమ్మను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. వారికి సహకరించిన మరో స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికలను మోసం చేసి పెళ్లి చేసుకుంటే పోక్సో కేసులు పెడతామని గుంటూరు సౌత్ జోన్ డిఎస్పీ భానోదయ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!